ఎన్నాళ్లు గడిచినా.. ఎంత పాతదైనా.. విలువ మారనిది ఒక్క కరెన్సీ నోటుకే అని చమత్కారంగా అంటుంటారు. కానీ అది నూరు శాతం నిజం.

మన దేశంలో ముద్రణ జరిగే కరెన్సీ నోట్లు, నాణేల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

ఆ నోటు మీద ఉండే ప్రతి గుర్తుకు, ప్రతి అక్షరానికి ఒక పర్పస్ ఉంటుంది.

దాని మీద ఉండే గుర్తుల కారణంగానే అది ఒరిజనలో కాదో.. కూడా తెలుసుకోవచ్చు. 

ఆ సెక్యూరిటీ ఫీచర్లు కొన్ని నోటుపై కనిపించేవి అయితే కొన్ని ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటాయి. 

కరెన్సీ నోటుపై రెండు వైపుల నల్ల గీతలను మీరు గమనించారా? అవి ఎందుకు ఉంటాయి. వాటి వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం.

కరెన్సీ నోటుపై రెండు వైపుల నల్ల గీతలను మీరు గమనించారా? అవి ఎందుకు ఉంటాయి. వాటి వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం.

దేశంలో అన్ని రకాల కరెన్సీ నోట్లు, నాణేలును ముద్రించేది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియానే. ఇంక ఆ అధికారం ఎవరికీ లేదు.

నాణేలను ఎలాగైతే విభిన్నంగా ప్రత్యేకంగా ముద్రిస్తారో.. కరెన్సీ నోట్లను కూడా అలాగే ప్రత్యేకమైన పేపర్ తో తయారు చేస్తారు.

వాటిని అంధుల కోసం ప్రత్యేకంగా తయారు చేసినవి.

నోటును తాకి అది ఎంత విలువైనదో అంధులు తెలుసుకోవడానికి అలా ముద్రిస్తారు.

మరి నోటుకు ఎన్ని గీతలు ఉంటాయో తెలుసా?

రూ.100 నోటు మీద నాలుగు గీతలు (|| ||) ఉంటాయి.

రూ.200 నోటయితే 4 గీతలు, 2 చుక్కలు (|| o o ||) కనిపిస్తాయి.

అదే రూ.500 నోటయితే ఐదు లైన్లు (|| | ||) ఉంటాయి.

రూ.2 వేల నోటైతే ఏడు గీతలు (| || | || |) ఉంటాయి.

అదండి సంగతి.. తెలుసుకున్నారుగా ఆ గీతలు ఎందుకు అని.