చాలా మంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయడంలో కాస్త నిర్లక్ష్యం చేస్తుంటారు.

అలా అల్పాహరం విషయంలో అలసత్వం పాటించడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సమయానికి బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్లే వచ్చే నష్టాలు ఏంటి? 

నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రోజూ ఉదయం నిద్రలేచిన రెండు గంటల్లోనే బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి.

అలా చేయకుంటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలకు గురికాక తప్పదని నిపుణులు చెబుతున్నారు. 

ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ స్థాయి క్రమంగా తగ్గే ఛాన్స్ ఉంటుందట. 

 శరీర మెటబాలిజం తగ్గడమే కాకుండా క్యాలరీలు సరిగ్గా ఖర్చు కాక కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. 

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మధుమేహం వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదే కాకుండా టైమ్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉందట. 

అలా రోజూ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే.. అధిక రక్తపోటు, ఉభయకాయం కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇక నుంచైనా ఉదయం నిద్రలేచిన రెండు గంటల్లోనే ఏదో ఒకటి అల్పాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.