సౌత్ కొరియా దేశానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా.. ఇండియన్ మార్కెట్ లోకి మరో కొత్త కారును గురువారం పరిచయం చేసింది.

 ‘కారెన్స్’ పేరుతో రిక్రియేషన్ వెహికిల్(ఆర్వీ)ని మార్కెట్ లో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే కంపెనీ  పేర్కొంది.

సెవన్ సీటర్ కియా కారెన్స్ కారును డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడమే గాక..

వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అమ్మకాలను ప్రారంభించే సన్నాహాలు చేస్తోంది కియా.

ఇండియాలో ఇప్పుడున్న అడ్వాన్స్ జనరేషన్ జనాలకు నచ్చే విధంగా కియా కారెన్స్ ని రూపొందించినట్లు తెలుస్తుంది.

 ‘మేడ్ ఇన్ ఇండియా.. మేడ్ ఫర్ వరల్డ్..’ అనే నినాదంతో కారెన్స్ ను  కియా లాంచ్ చేసినట్లు తెలుస్తుంది.

అనంతపూర్ జిల్లాలోని కియా మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంలో కారెన్స్ ఉత్పత్తి అవుతోంది. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లలో కియా కారెన్స్ గేమ్ చేంజర్ గా నిలిచే అవకాశం ఉందని..

కియా ఇండియా ఎండీ, సీఈవో తే-జిన్ పార్క్ పేర్కొన్నారు.

ఇదివరకు కియా నుండి సెల్టోస్, కార్నివాల్ మరియు సోనెట్ కార్స్ అధికారికంగా లాంచ్ చేయబడ్డాయి.

కియా నుండి వస్తున్న 4వ ప్రోడక్ట్ ఇది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో కియా కారెన్స్ ఎంట్రీ అవుతుండటంతో ఈ కారు ఫీచర్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ఈ న్యూ కియా కారెన్స్ ఫీచర్స్ చూసినట్లయితే.. మూడు వరుసల స్లీక్ ఫ్రంట్ గ్రిల్, స్వెప్ట్-బ్యాక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, వై షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 

డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, ఇంటీరియర్స్లో 10.25 ఇంచ్ టచ్స్క్రీన్ సిస్టం, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ ఏసీ, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి రాబోతుంది.

ఈ కియా కారెన్స్ పెట్రోల్ – డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ తో పాటు 3 డ్రైవ్ మోడ్లను కలిగి ఉంటుంది.

మాన్యువల్, సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్, DCT గేర్ బాక్స్ ఆప్షన్స్ ఈ కారు కల్పిస్తుంది.

ఈ కారు డిజైన్ సెల్టోస్ను ఎక్స్టెండ్ చేసినట్లు ఉంది. ఇంటీరియర్ డిజైన్ మాత్రం అన్ని కియా కార్ల తరహాలోనే ఉంది.

25 అంగుళాల స్క్రీన్ తో పాటు డిఫరెంట్ గేర్ సెలెక్టర్ కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో రాబోతుంది.

6 లేదా 7 సీటర్ లే అవుట్లతో మరిన్ని వెర్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

రెండో వరుసలో కూర్చునే ప్యాసెంజర్లకు స్పెషల్ ఫీచర్లు ఉంటాయి.