తాతలు, ముత్తాల కాలంలో గంపెడు మంది పిల్లలు ఉండేవారు. ఓ ఇంట్లో కనీసంగా ఐదు మందికి పైగా సంతానం ఉండేది అప్పట్లో.
అయితే పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని, కొన్ని దేశాలు కుటుంబ నియంత్రణను తీసుకు వచ్చాయి.
దీంతో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనేవారు. కానీ నేటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్క సంతానం చాలు అనుకుంటున్నారు అనేక మంది తల్లిదండ్రులు
అయితే ఇప్పుడు మనం చెప్పుకునే జంట దీనికి పూర్తిగా భిన్నం. వారికి పుట్టిన పిల్లల సంఖ్య చూస్తే బిత్తరపోవాల్సిందే.
పోనీ వాళ్లకేమన్నా పెద్ద వయస్సా అనుకుంటే పొరపాటు.. ఆ తల్లికి 40 ఏళ్లు కూడా నిండలేదు.
వారే అమెరికాకు చెందిన ఆండ్రే డ్యూక్, కోరా డ్యూక్. ప్రస్తుతం తల్లి వయస్సు 39 ఏళ్లు
ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆమె 28 ఏళ్లకే తొమ్మిది మంది పిల్లలకు తల్లయ్యింది
తొలి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో కోరా వయసు 17 ఏళ్లు
ఆండ్రే, కోరాలది లవ్ మ్యారేజ్. 2001లో వివాహం చేసుకున్నారు. ఆ ఏడాదే తొలి బిడ్డకు జన్మనివ్వగా.. 2012లో చివరి సారిగా తల్లయ్యింది.
సుమారు ఈ 12 ఏళ్లలో ఆమె 9 మందికి జన్మనివ్వగా.. మూడో సంతానం ఏడు రోజులకే చనిపోయాడు.
ఇప్పడు 8 మంది పిల్లలతో భార్యాభర్తలు జీవిస్తున్నారు. అయితే ఆమె పిల్లల్ని పరిచయం చేస్తూ వీడియో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు మొదటి బిడ్డ ఎలిజా వయసు 21. రెండో కుమార్తె షేనా వయసు 20 ఏళ్లు.
ఆ తర్వాత వీరికి జాన్ (15), కైరో (15), సయా (14), అవి (13), రోమని (12), తాజ్ (10) పిల్లలు ఉన్నారు
ఉద్దేశపూర్వకంగా తాను ఇంత మంది పిల్లలను కనలేదని కోరా వెల్లడించింది.
సంప్రదాయ కుటుంబ నియంత్రణ పద్ధతులు విఫలం కావడం వల్లే ఇన్ని సార్లు గర్భం దాల్చినట్లు తెలిపింది.
తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపింది.
తన భర్త సహకారంతోనే ఇదంతా చేయగల్గినట్లు పేర్కొంది.