ఇంటర్నేషనల్ క్రికెట్లో కొత్త నిబంధనలు!!

అక్టోబర్ 1  2022 నుంచి మన్కడింగ్ ను అధికారికంగా 'రన్ అవుట్' కింద పరిగణించనున్నారు.

స్ట్రైకింగ్ లో ఉన్న బ్యాటర్ బంతిని గాల్లోకి లేపితే దాన్ని ఫీల్డర్ అందుకునేలోపు ఇద్దరు బ్యాటర్లు స్ట్రైకింగ్  మారితే క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ చేయాలి.

కానీ, ఓవర్లో చివరి బంతికి బ్యాటర్ ఇలా  ఔటైతే నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న బ్యాటర్ తర్వాతి ఓవర్‌లో తొలి బంతికి బ్యాటింగ్ చేయొచ్చు.

కొవిడ్ కారణంగా బంతిపై లాలాజలాన్ని వూసే విధానాన్ని ఐసీసీ నిషేధించింది.

ఇంతకు ముందు రనౌట్ నిర్ణయించేటప్పుడు బ్యాటర్ క్రీజులోకి వచ్చినా బెయిల్ కిందపడే సమయంలో బ్యాట్ గాల్లో ఉంటే దానిని ఔడగా పరిగణించేవారు. 

కానీ, ఇప్పుడు బ్యాటర్ ఒకసారి క్రీజులోకి వస్తే చాలు.

బ్యాట్ ఎడ్జ్ 40 మి.మీటర్లు, మందం 67 మి.మీటర్లు మించకూడదు.

నిర్ణీత సమయంలోగా ఆఖరి ఓవర్‌లో తొలి బంతి వేయకపోతే 30 యార్డ్స్‌ వెలుపల ఒక ఫీల్డర్ని తక్కువగా ఉంచాలి..

టీ20 క్రికెట్లో కొత్తగా రెండున్నర నిమిషాల డ్రింక్స్ బ్రేక్ తీసుకొచ్చారు. 'అయితే, సిరీస్ కు ముందుగానే ఒక సమయం నిర్ణయించుకుని ఆ సమయంలో బ్రేక్ తీసుకోవాలి.

బ్యాట్స్ మ్యాన్ బ్యాటింగ్ చేసే స్థానం నుంచి కొంచెం దూరంగా వెళ్లినా దానిని వైడ్ గా పరిగణించనున్నారు.

గతంలో బ్యాట్స్ మ్యాన్ అస్వస్థతకి గురైనప్పుడు, గాయ పడినప్పుడు మాత్రమే మైదానం వీడే అవకాశం ఉండేది.

కానీ, ఇప్పుడు బ్యాటర్ స్వచ్ఛందంగా మైదానాన్ని వీడి వేరే బ్యాట్స్ మ్యాన్ కు అవకాశం కల్పింవచ్చు.