హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కంపెనీ తయారు చేసిన e-bike ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించవచ్చని నిరూపించింది.
గ్రావ్టన్ మోటార్స్ అనే కంపెనీ తయారు చేసిన e-bike ఒక సారి ఛార్జింగ్ తో 4 వేల 11 కి.మీ ప్రయాణించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.
ప్రస్తుతానికి ఈ బైకుకు Quanta అని పేరు పెట్టారు. భవిష్యత్తులో దీన్ని మరింత శక్తివంతంగా తయారుచేస్తామని కంపెనీ తెలిపింది.
2022 చివరి నాటికి బైక్ లను మార్కెట్ లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు తయారీదారులు తెలిపారు.
హైదరాబాద్ లోని చర్లపల్లి కేంద్రంగా గ్రావ్టన్ మోటార్స్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.