దేశంలో ఇప్పుడున్న ఇంధన ధరలు చూస్తే వాహనదారులు బయటికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. అందువలనే అందరూ ఇంధనం వైపు కాకుండా టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వాహనాలనే కొనుగోలు చేసేందుకు పబ్లిక్ ఎగబడుతున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడంతో.. కస్టమర్లు ఆకర్షించే విధంగా కొత్త కొత్త మోడల్స్ మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి తయారీ సంస్థలు. 

ఇదివరకే మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నప్పటికీ, తాజాగా బెంగుళూరుకు చెందిన బౌన్స్‌ ఇన్ఫినిటి అనే స్టార్టప్‌ కంపెనీ నూతన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

వచ్చే ఏడాది నుంచి బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డెలివరీలు ప్రారంభించనుంది కంపెనీ. 

ఈ స్కూటర్లు రెడ్‌, బ్లాక్‌, వైట్‌, గ్రే కలర్స్ లో అందుబాటులోకి తీసుకురానుంది. అదీగాక ఈ బౌన్స్ స్కూటర్స్ అద్భుతమైన ఫీచర్స్ తో మార్కెట్లోకి రానున్నాయి. 

ఈ స్కూటర్ ఫీచర్స్ చూసినట్లయితే.. స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, ఆప్షన్ లతో పాటు రివర్సింగ్‌ మోడ్‌ కలిగి ఉంటుంది. 

స్కూటర్ ను ఈకో మోడ్‌తో చార్జ్‌ చేసి సుమారు 85 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చని కంపెనీ తెలిపింది. 

అంతేగాక స్వాపింగ్‌ ఫీచర్‌ తో కన్వెన్షల్‌ సాకెట్‌ ద్వారా బ్యాటరీ చార్జ్‌ చేసుకోవచ్చు. 

ప్రస్తుతానికి ఇండియాలోని పలు ప్రధాన నగరాల్లో బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లను బౌన్స్ ఏర్పాటు చేసింది.

 ఇకముందు దేశవ్యాప్తంగా దాదాపు 3500 బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది.

ప్రస్తుతం బౌన్స్‌ ఇన్ఫినిటీ ఈ౧ స్కూటర్ ధర బ్యాటరీ ప్లస్‌ చార్జ్‌తో కలిపి రూ.79,999 (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది.

ఇక బ్యాటరీ యూజ్‌ ఏ సర్వీస్‌ స్కూటర్‌ ధర రూ.45,099 (ఢిల్లీలో) నిర్ణయించింది. 

మరికొన్ని రాష్ట్రాల్లో బ్యాటరీ ప్లస్‌ చార్జ్‌తో కలిపి రూ.59,999 వరకు ఉండే అవకాశం ఉందని కంపెనీ వివరించింది.

ఇప్పటికైతే రూ.499తో టోకెన్‌ ధరతో స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయని.. 

మినిమం 3 సంవత్సరాల వారంటీతో స్కూటర్ అమ్మకాలు జరపనున్నట్లు బౌన్స్ తెలియజేసింది. 

నెట్టింట బౌన్స్ స్కూటర్ వైరల్ అవుతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మీ అభిప్రాయాలూ కామెంట్స్ ద్వారా తెలుపవచ్చు.