అవాంఛిత గర్భం అనేది చాలా మంది దంపతులకు సమస్యగా మారుతోంది.
చాలామంది జంటలు పెళ్లైన వెంటనే పిల్లల్ని కనాలి అనుకోరు.
ఇంకొంత మంది ఒక బిడ్డ తర్వాత..రెండో బిడ్డ కోసం కాస్త గ్యాప్ తీసుకోవాలి అనుకుంటారు.
అలాంటి వాళ్లు ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా.. కొన్నిసార్లు గార్భం దాలుస్తుంటారు.
ఇలాంటి అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు.. చాలా ప్రయత్నాలే చేస్తుంటారు.
అలాంటి వాటిలో కొన్నింటి వల్ల ఆరోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే పరికరం వల్ల అలాంటి సమస్యలు ఉండవు. పైగా గర్భం నిరోధం చాలా సులభం కూడా.
అవాంఛిత గర్భాల నియంత్రణకు సరికొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది.
చిన్న సూది అంత పరిమాణంలో ఉండో ఈ పరికరాన్ని మహిళల మోచేతికి కొంచెం పైన చర్మం పైపొరలో అమరుస్తారు.
ఈ పరికరాన్ని.. సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ అంటారు.
ఈ పరికరం ఇంప్లాంట్.. కేవలం సూదితో ఇంజెక్షన్ చేసినట్లుగానే ఉంటుంది.
100 మంది మహిళలపై ఏడాదిపాటు ప్రయోగం చేయగా.. ఒక్కరి కంటే తక్కువ వైఫల్యం ఎదురైంది.
ఈ పరికరాన్ని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
దీని ద్వారా మూడేళ్ల పాటు అవాంఛిత గర్భాన్ని నియంత్రించవచ్చు.
మీకు వద్దు అనుకున్న సమయంలో ఆ పరికరాన్ని తీసేస్తే.. 48 గంటల సమయంలో గర్భం దాల్చేందుకు వీలుంటుంది.