జర్మనీకి చెందిన ఆడి కంపెనీ త్వరలోనే భారత్‌లో ఇ-రిక్షా తీసుకురాబోతుంది.

జర్మన్, ఇండియన్ స్టార్టప్ అయిన నునామ్‌తో కలిసి ఈ ప్రయత్నం చేయబోతోంది. 

ఆడి ఇ-ట్రాన్‌ వాహనాలను పరీక్షించడానికి ఉపయోగించిన బ్యాటరీలను ఈ ఆడి ఇ-రిక్షాల్లోఉపయోగించనున్నారు.

ఎక్కువ వోల్టేజ్ ఉన్న బ్యాటరీలను తిరిగి ఉపయోగించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 

అంటే ఆ బ్యాటరీలకు రెండో లైఫ్ ఇవ్వడం లాంటిది.

ఆడి ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాటరీలకు పునరుజ్జీవం కల్పించి వాటిని ఇ-రిక్షాల్లో అమర్చనుంది.

ఆడి ఏజీ, ఆడి ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్, నుమామ్ కలిసి తీసుకొస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇది. 

ఆడి ఇ-రిక్షాను మొదట ఎలక్ట్రిసిటీతో ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత సోలార్ ఛార్జింగ్ స్టేషన్లలో కూడా ఛార్జ్ చేసేలా నునామ్ ఇ-రిక్షాలను రూపొందిస్తోంది. 

ప్రస్తుతం ప్రోటోటైప్‌లు మాత్రమే తయారయ్యాయి. ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఇందులో మార్పులు ఉండొచ్చు.

పర్యావరణానికి మేలు చేయడం, మహిళలకు అండగా నిలవడం లాంటి లక్ష్యాలతో చేపట్టిన ప్రాజెక్ట్ కాబట్టి ఆడి ఇ-రిక్షాలు కమర్షియల్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం లేదు. 

వీటి ధర వివరాలు కూడా తెలియదు. 

వీటిని మొదట కేవలం స్వచ్ఛంద సంస్థలకు అందించేందుకే రూపొందిస్తున్నారు.

2023 ప్రారంభంలో తొలి పైలట్ ప్రాజెక్ట్ కింద ఆడి ఇ-రిక్షాలు రాబోతున్నాయి.