అంబాసిడర్.. ఈ కారు పేరు ఇప్పటి తరానికి పెద్దగా తెలియదేమో గానీ.. ఓ ఇరవై ఏళ్ల క్రితం వరకు అంబాసిడర్ కారంటే తెలియనివారుండరు.

 అప్పట్లో కార్లలో కెల్ల రారాజు కారు ఏదంటే టక్కున అంబాసిడర్ కారు అని చెప్పేవారు.

 హిందుస్థాన్ మోటార్స్ కంపెనీకి చెందిన అంబాసిడర్ కారు సుమారు ముప్పై ఏళ్లపాటు ఓ వెలుగు వెలిగింది.

దేశ ప్రధాని నుంచి మొదలు సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులంతా అంబాసిడర్ కారులోనే తిరిగే వారు.

 ఐతే కాలక్రమేనా ఇతర కంపెనీల కార్లు మార్కెట్లోకి రావడంతో మెల్లి మెల్లిగా అంబాసిడర్ కారు కనుమరుగైంది.

సుమారు పదిహేనేళ్ల నుంచి దాదాపు అంబాసిడర్ కారు ఎక్కడా కనిపించడం లేదు. కొనుగోళ్లు పడిపోవడంతో హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ అంబాసిడర్ కార్ల తయారీనీని నిలిపివేసింది.

 ఐతే కొంత మంది అంబాసిడర్ కార్ల ప్రియులు మాత్రం తన కార్లను అలాగే తమ గ్యారేజ్ లో పదిలంగా ఉంచుకున్నారు.

 ఇక అసలు విషయానికి వస్తే.. అంబాసిడర్ కారు మళ్లీ మార్కెట్లోకి వస్తోంది. అవును మీరు చదివింది నిజమే. సరికొత్త హంగులతో అంబాసిడర్ కారును మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. 

ఇప్పుడు వస్తున్న కార్ల డిజైన్ల మేరకు సెడాన్ టైపులో అంబాసిడర్ కారును మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు. 

ఈ కారు టెక్నాలజీ మన దేశానిదే అయినా కొత్త అంబాసిడర్ కారును స్విట్జర్లాండ్ లో రూపొందించారు. కారు లుక్కు మాత్రం అదిరిపోయింది.

ఆడి, బీఎండబ్లూ కార్ల మాదిరిగా లగ్జరీ లుక్ తో కనిపిస్తోంది.

ఇక్కడ మరో ఆసక్తిరమైన అంశం ఏంటంటే.. 

మార్కెట్లోకి రాబోతున్న అంబాసిడర్ కారు ఎలక్ట్రిక్ మోడల్.

అంటే బ్యాటరీతో పనిచేస్తుందన్నమాట. ఇక ఈ అంబాసిడర్ కారు ధర ఎంతో మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.