ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అందరం రోజూ స్నానం చేస్తుంటాం.

ముఖ్యంగా స్నానం చేసే క్రమంలోనే చాలా మంది అనేక రకాల పొరపాట్లు చేస్తుంటారు. 

తద్వారా తొందరగా బట్టతల రావడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి.

 ఇలాంటి వారి కోసం నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.

స్నానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఎలాంటి సూచనలు చేస్తున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 సాధారణంగా ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ తల స్నానం చేస్తు ఉంటారు. 

స్నానం చేసే క్రమంలో చాలా మంది పొడి జుట్టుకు షాంపు అప్లై చేసి ఆ తర్వాత జుట్టుపై నీళ్లు పోస్తుంటారు.

అలా చేయడం వల్ల తలపై మురికి అలాగే ఉండి జుట్టు పొడిబారి రాలిపోతూ ఉంటుంది.  అలా అస్సలు చేయకూడదని నిపుణులు అంటున్నారు.

తడి జుట్టుపై మాత్రమే షాంపును అప్లై చేయాలని, ఇలా చేయడం వల్ల తలపై ఉండే మురికి పోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 

చాలామంది  వేడినీటితో తల స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా జుట్టు పూర్తిగా దెబ్బతింటుందని అంటున్నారు. 

వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ప్రతీ రోజు స్నానం చేసేటప్పుడు షాంపును వాడడం కూడా అంత మంచిది కాదని కూడా నిపుణలు అంటున్నారు.

గమనిక: ఇది అంతర్జాలంలో సేకరించిన సమాచారం మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.