సాధారణంగా సెలబ్రిటీలు అన్నా, వారి వ్యక్తిగత జీవితం, కుటుంబ, పిల్లల గురించి తెలుసుకోవాలని అభిమానులకే కాక సామాన్యులకు కూడా ఆసక్తి ఉంటుంది.

సెలబ్రిటీల పిల్లలు ఎవరు..  వారు ఏం చేస్తున్నారు.. ఎక్కడ చదువుతున్నారు ఇలాంటి విషయాలపై అందరికి ఇంట్రెస్ట్‌ ఉంటుంది.

ప్రస్తుతం ఉన్నది సోషల్‌ మీడియా యుగంలో సెలబ్రిటీలు మాత్రమే కాదు..

వారి పిల్లలు కూడా  పుట్టినప్పటి నుంచే ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు.

సెలబ్రిటీల సంతానం కూడా చిన్న వయసు నుంచే సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటూ.. పాపులారిటీ పెంచుకుంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కుమార్తె సనా గంగూలీ గురించి సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యింది.

కారణం చదువుకుంటూనే సనా.. ఉద్యోగం చేస్తూ.. మంచి ప్యాకేజీ అందుకుంటుది.

ఈ క్రమంలో కొందరు సచిన్‌ కుమార్తె సారా, గంగూలీ కుమార్తె సనాలను పోల్చుతూ.. వారిద్దరిలో ఎవరు బెస్ట్‌ అని చర్చించుకోసాగారు.

ఇక సారా విషయానికి వస్తే.. తను సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టీవ్‌.

అయితే గంగూలీ కుమార్తె సనా మాత్రం ఇందుకు భిన్నం. ఆమె సోషల్‌ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తోంది.

సారా టెండుల్కర్‌.. 1997, అక్టోబర్‌ 12న జన్మించింది.

ముంబైలోని ధీరుబాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.

ఇక సారా సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. హల్చల్‌ చేస్తుంటుంది.

ఇక సారా చాలా అందంగా ఉంటుంది. దాంతో ఆమె హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తుంటాయి.

 వీటికి తోడు.. శుభమాన్‌ గిల్‌తో సారా డేటింగ్‌లో ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

సారా మోడలింగ్‌ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ క్లారిటీ లేదు.

సారా ఎక్కువగా తన ఫొటోషూట్‌లు, డేటింగ్‌ వార్తలతో సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తుంది.

ఇక సారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రేంజ్‌లో ఫాలోవర్లు ఉన్నారు.

భారత మాజీ కెప్టెన్‌ గంగూలీ ముద్దుల తనయ సనా గంగూలీ. తల్లి డోనా మాదిరిగానే ఆమెకు నాట్యం అంటే ఇష్టం.

ఇక సనా గంగూలీ 2001, నవంబర్‌ 3న జన్మించింది. వయసులో సారా కన్న నాలుగేళ్లు చిన్నది.

సనా గంగూలీ కోల్‌కతాలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది.

యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేయడానికి వెళ్లింది.

సనా లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ ప్రకారం.. ఆమె 2022 జూన్‌ నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక సలహా కంపెనీలలో ఒకటైన పీడబ్ల్యూసీలో ఇంటర్న్‌గా పని చేస్తోంది.

ప్రస్తుతం సనా చదువు పూర్తి కాకుండానే..  ఏడాదికి 30 లక్షల జీతం ఆర్జిస్తోంది.

ఇక ఇక సచిన్‌ కుమార్తె సారాతో పోలిస్తే.. సనా సోషల్‌ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంది.

కుటుంబం, ఫ్రెండ్స్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తుంది. సనా తల్లితో కలిసి నృత్య ప్రదర్శనలు ఇచ్చి.. వార్తల్లో నిలిచింది.

సారా సోషల్‌ మీడియాలో సెలబ్రిటీగా మారితే.. సనా అప్పుడే ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం అవుతూ ముందుకు సాగుతున్నారు.

స్టార్‌ క్రికెటర్ల బిడ్డలిద్దరూ తమకు నచ్చిన కెరీర్‌లో ఉన్నత విజయాలు అందుకునే దిశగా సాగుతున్నారు.