నెట్ ఫ్లిక్స్ కి ప్రపంచంలో కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
విదేశాలలోనే కాకుండా.. ఇండియాలో కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థకు మంచి ఆదరణ ఉంది.
ఒకప్పుడు భారత్ లో కూడా నెట్ ఫ్లిక్స్ కు ఎంతో మంది యూజర్లు ఉండేవాళ్లు. కానీ, ఇప్పుడు కాస్త ఆదరణ తగ్గిందనే చెప్పాలి.
ఇటీవలి కాలంలో సబ్ స్క్రిప్షన్ ధరను తగ్గించడం వల్ల భారత్ లో ఈ సంస్థకు లాభాలు వచ్చాయి.
అయితే నో పాస్ వర్డ్ షేరింగ్ పాలసీని ప్రకటించిన తర్వాత మళ్లీ నెట్ ఫ్లిక్స్ కి ఆదరణ తగ్గింది.
ఒక్క భారత్ లోనే కాకుండా.. ప్రపంచ దేశాల్లో నెట్ ఫ్లిక్స్ కి సబ్ స్రై్ బర్లు బాగా తగ్గారు.
ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మళ్లీ సబ్ స్క్రైబర్లను పెంచుకునే పనిలో పడింది.
అందుకోసం భారత్ సహా..115 దేశాల్లో సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
నిజానికి విదేశాల్లో ఉండే ప్లాన్స్ తో పోలిస్తే.. భారత్ లో సబ్ స్క్రిప్షన్ చాలా తక్కువగా ఉంటుంది.
గతంలో రూ.199గా ఉన్న ఓన్లీ మొబైల్ నెట్ ఫ్లిక్స్ ప్లాన్ ని రూ.149కే అందిస్తున్నారు.
పీసీ, మొబైల్, ట్యాబ్లెట్ లో లాగిన్ చేసుకునేలా ఉండే ప్లాన్ ధర రూ.499గా ఉండేది. ఆ ప్లాన్ ను ఇప్పుడు కేవలం రూ.199కి అందిస్తున్నారు.
2 స్క్రీన్స్ తో వచ్చే స్టాండర్డ్ ప్లాన్ ధరను రూ.499గా నిర్ణయించారు.
4 స్క్రీన్స్ తో వచ్చే ప్రీమియం ప్లాన్ ధరను రూ.649గా తీసుకొచ్చారు.
నో పాస్ వర్డ్ షేరింగ్ విధానంపై మాత్రం నెట్ ఫ్లిక్స్ భారత్ లో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.
త్వరలోనే నెట్ ఫ్లిక్స్ సంస్థ పాస్ వర్డ్ ని షేర్ చేస్తే అదనంగా ఛార్జ్ అవకాశం లేకపోలేదు.