ఆయుర్వేద ఔషధం కర్పూరాది చూర్ణం.. కర్పూరాది నూనెలో కర్పూరం ఉంటుంది.
ఆయుర్వేదం కాకుండా, అనేక అల్లోపతి మందుల్లో కూడా కర్పూరం ఉంటుంది. చాలా బామ్‌లలో కర్పూరం ఉంటుంది.
కర్పూరం చెట్టు ఆకులు, బెరడు, కలపను స్వేదనం చేయడం ద్వారా కర్పూరం తయారు చేస్తారు.
కర్పూరం ఓ విలక్షణమైన రుచి, మండే లక్షణాలు కలిగిన తెల్లటి పదార్థం. దీని కెమికల్ ఫార్ములా C10 H 16O.
కర్పూరాన్ని చెట్టు, టర్పెంటైన్ నూనె నుంచి కృత్రిమంగా తయారు చేస్తారు. ఇళ్లు, గుళ్లలో పూజా వస్తువుగా దీన్నే యూజ్ చేస్తున్నారు.
చెట్టు నుంచి లభించే కర్పూరాన్ని పచ్చ కర్పూరం అంటారు. దీన్ని ఔషధాలు, ఆహారంలో సువాసన కారకంగా ఉపయోగిస్తారు.
కర్పూరం నూనెని సాధారణ హెయిర్ ఆయిల్‌తో కలిపి ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ, జుట్టు పెరుగుదల పెరుగుతుంది.
మసాజ్ ఆయిల్‌లో కర్పూరాన్ని కలిపి తలకు పట్టించడం వల్ల చుండ్రు తగ్గుతుంది. పిల్లల కఫం తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది.
దగ్గుకు మంచి ఔషధం కర్పూరం. నీటితో దీన్ని ఆవిరి పట్టడం వల్ల ఊపిరితిత్తుల వాయునాళాలపై పూత ఏర్పడి దగ్గు దూరమవుతంది.
కర్పూరపు పొగను పీల్చడం వల్ల మూర్ఛ, హిస్టీరియా, గౌట్ నుండి ఉపశమనం లభిస్తుంది.
చర్మం దురదలకు కూడా ఇది మంచి మందు. కర్పూరం పొడిని దురద ఉన్న ప్రాంతంలో పూయవచ్చు.
కొబ్బరినూనెలో సింథటిక్ కర్పూరాన్ని వేసి వేడి చేసి చల్లారిన తర్వాత కాళ్లకు మసాజ్ చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.
కర్పూరం, కొన్ని చుక్కల కొబ్బరి నూనెతో కలిసి మసాజ్ చేయడం వల్ల మొటిమలు, దాని మచ్చలు తొలగిపోతాయి.
భారతదేశంలో కర్పూరం చెట్లు ఎక్కువగా ఉన్నాయి. కర్పూరం అనేది ముప్పై మీటర్ల వరకు పెరిగే చెట్టు.
కర్పూరం నూనె స్మెల్ (సువాసన) మనసుని హాయిగా చేస్తుంది. మీకు మంచి నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.