ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన  'మళ్లీ పెళ్లి' మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం

ముందుగా కథ విషయానికి వస్తే నటుడు నరేంద్ర (సీనియర్ నరేష్), అతడి మూడో భార్య సౌమ్య సేతుపతి (వనితా విజయ్ కుమార్) మధ్య గొడవలు జరుగుతుంటాయి.

భార్య వల్ల నరేంద్రకు ప్రశాంతత ఉండదు. సరిగ్గా ఆ టైంలో ఆయనకు నటి పార్వతి (పవిత్రా లోకేష్)తో రిలేషన్ మొదలవుద్ది

వీరి స్నేహం కొన్నాళ్ళకు ప్రేమగా మారి.. ఇద్దరూ మానసికంగా ఒక్కటి అవుతారు.

 దీంతో భర్త నరేంద్రపై  మూడో సౌమ్య పగ పెంచుకుంటుంది.

మరోవైపు పార్వతికి తనతో పదకొండేళ్లు సహజీవనం చేసిన ఫణింద్రతో(అద్దూరి రవివర్మ) సమస్యలు ఉంటాయి

ఇవన్నీ దాటుకుని నరేంద్ర, పవిత్ర ఎలా ఒక్కటి అయ్యారు  అనేది 'మళ్లీ పెళ్లి' స్టోరీ.

నరేష్-పవిత్రా లోకేష్ బంధానికి ఒక పాజిటివ్ జస్టిఫికేషన్ ఇవ్వడానికి ఈ సినిమా తీశారని అర్ధం అవుతుంది.

మొత్తం వ్యవహారంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిదే తప్పు అనిపించేలా ఈ సినిమాని తీశారు.

ఈ రియల్ కథని ఎంఎస్ రాజు సినిమాగా  ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

నరేష్-పవిత్రా ఎలాగో రిలేషన్ లో ఉన్నారు కాబట్టి.. వారి క్యారెక్టర్స్ లో వాళ్ళు జీవించేశారు.

 విజయనిర్మల క్యారెక్టర్ పాత్రలో జయసుధ, సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో శరత్ బాబు బాగానే నటించారు.

వాళ్లకు పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కలేదు. మొత్తం సినిమా అంతా కూడా నరేష్-పవిత్రా లోకేష్ క్యారెక్టర్స్ మాత్రమే హైలెట్ అయ్యేలా చూసుకున్నారు.

ఇక టెక్నికల్ గా కూడా మళ్ళీ పెళ్లి మూవీ బాగానే ఉంది.

 ఓవరాల్ గా నరేష్-పవిత్రా లోకేష్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించే వారికి  'మళ్లీ పెళ్లి' మూవీ నచ్చుతుంది.