ఒక్కో టైమ్ లో ఒక్కో నటుడు ఫేమస్ అవుతుంటారు. అలా ఈ మధ్య సీనియర్ నరేష్ చాలా క్రేజ్ తెచ్చుకున్నాడు.

అప్పుడెప్పుడో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన నరేష్.. ప్రస్తుతం హీరోలందరి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత మళ్లీ పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

సినిమాల పరంగా నరేష్ ని వంకపెట్టడానికి ఏం లేదు. ఎందుకంటే దాదాపు 50 ఏళ్ల నుంచి నటిస్తున్నాడు కాబట్టి.

అయితే వ్యక్తిగతంగా మాత్రం నరేష్.. గత ఏడాది కాలం నుంచి ఎప్పటికప్పుడు న్యూస్ లో హాట్ టాపిక్ అవుతున్నాడు.

నరేష్ తరచుగా వార్తల్లో ఉండటానికి కారణం అతడి మూడో భార్య రమ్య రఘపతి, నటి పవిత్రా లోకేష్.

చాలాకాలం నుంచి రమ్యకు దూరంగా ఉంటున్న నరేష్, ప్రస్తుతం పవిత్రా లోకేష్ తో కలిసే ఉంటున్నారు.

ఈ క్రమంలోనే తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్రతో ఎలా ఉంటాడంటూ రమ్య కోర్టుని ఆశ్రయించింది.

ప్రస్తుతం నరేష్ విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉంది. దీనిపై ఇంకా విచారణ కూడా జరుగుతోంది.

ఆ కేసు అలా ఉండగానే పవిత్రాని పెళ్లి చేసుకున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేసిన నరేష్ అందరికీ షాకిచ్చాడు.

న్యూయర్ కు ముద్దు పెట్టుకున్న వీడియో రిలీజ్ చేసిన నరేష్.. రీసెంట్ గా పెళ్లి వీడియో పోస్ట్ చేశాడు.

ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులు నరేష్-పవిత్రా లోకేష్ బంధం గురింతి తెగ మాట్లాడుకుంటున్నారు.

ఇప్పుడు ఈ పెళ్లి గురించి నరేష్.. అసలు విషయం బయటపెట్టేశాడు. ఇదంతా సినిమా కోసమేనని చెప్పి షాకిచ్చాడు.

నరేష్-పవిత్రా లోకేష్ 'మళ్లీ పెళ్లి' అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు. రియల్ గానే కాదు రీల్ లోనూ కపుల్ గా నటిస్తున్నారు.

తాజాగా అసలు విషయం చూసిన నెటిజన్స్.. ఇదంతా సినిమా కోసం చేసిన పబ్లిసిటీ స్టంటా అని నిట్టూర్చుతున్నారు.

మరి నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి వ్యవహారం అంతా.. ఓ మూవీ కోసమని తెలిసి మీరు ఎలా ఫీలయ్యారు. కింద కామెంట్ చేయండి.