టాలీవుడ్‌లో మరో క్రేజియెస్ట్ కపుల్ పెళ్లి పీటలు ఎక్కింది.
వివాదాస్పద, సెన్సేషనల్ జంటగా పేరు గాంచిన నటులు నరేష్-పవిత్రలు పెళ్లితో ఏకమయ్యారు.
నరేష్‌కు ఇది నాల్గవ వివాహం కాగా, పవిత్రకు ఇది రెండవ పెళ్లి
అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది
తాము పెళ్లి చేసుకున్నామన్నా విషయాన్ని నటుడు నరేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరిద్దరూ.. సుమారు నాలుగేళ్ల నుండి సహజీవనంలో ఉన్నారు.
వీరి మధ్య సంబంధాన్ని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి బయటపెట్టారు.
కర్ణాటకలోని ఓ హోటల్ లో వీరిద్దరూ ఉండగా.. మీడియాను తీసుకెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది రమ్య.
మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులివ్వకుండానే నరేష్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కారు.
ప్రస్తుతం వీరి పెళ్లి న్యూసే హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాదూ ఈ జంట హనీమూన్ కూడా వెళ్లినట్లు సమాచారం
దుబాయ్ వీధుల్లోనూ, ఎడారుల్లోనూ ఈ జంట విహరిస్తున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.
న్యూ ఇయర్ సందర్భంగా తమ మధ్య ఉన్న రిలేషన్ ను ఓ వీడియో రూపంలో రివిలీ చేశారు నటుడు నరేష్
ఆ సమయంలోనే త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఇప్పుడు పెళ్లి వీడియోను షేర్ చేశారు.