టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన అంశాల్లో సీనియర్ నటుడు నరేష్, కన్నడ నటి పవిత్రా లోకేష్ ప్రేమ వ్యవహారం ఒకటి.
నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. పవిత్రకు కూడా ఇదివరకే మ్యారేజ్ అయింది.
అయితే భర్త సుచీంద్ర ప్రసాద్‌తో విడాకులు తీసుకొని 2018లో విడిపోయారు పవిత్రా లోకేష్. నరేష్‌కు కూడా మూడో భార్యతో విభేదాలు ఉన్నట్లు వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
అంతేగాక ఇద్దరూ కలసి ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమాలోనూ నటించారు. గా మారింది.
ఇటీవల విడుదలైన ‘మళ్లీ పెళ్లి’కి పెద్దగా ప్రేక్షకాదారణ దక్కలేదు. అయితే ఈ మూవీ నరేష్-పవిత్రల రియల్ లైఫ్ స్టోరీని తలపించిందనే కామెంట్లు వినిపించాయి.
ఇదిలా ఉంటే.. పవిత్రతో తన ప్రేమ వ్యవహారం గురించి మీడియా ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నారు నరేష్.
తాజాగా పవిత్రతో రిలేషన్షిప్ గురించి నరేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఆమెతో పిల్లల్ని కనడంపై ఆయన స్పందించారు.
పిల్లల్ని కనడంపై నరేష్ స్పందిస్తూ.. తాను, పవిత్ర ఫిజికల్‌గా పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పారు.
పవిత్రకు, తనకు ఉన్న పిల్లలందరూ సమానమేనని నరేష్ చెప్పుకొచ్చారు. అయితే ఫ్యూచర్లో ఏంటనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.
రక్త సంబంధం కంటే కూడా భావోద్వేగమైన బంధాలే చాలా శక్తిమంతమైనవని నరేష్ స్పష్టం చేశారు.
మంచి భార్యను ఇవ్వలేకపోయానని తన అమ్మ ఎప్పుడూ అనేదని నరేష్ తెలిపారు.
పవిత్రా లోకేష్ ఇప్పుడు తన జీవితంలోకి వచ్చారని.. అమ్మ పుట్టిన రోజే పవిత్ర బర్త్ డే కూడా అని పేర్కొన్నారు.
పవిత్రకు ఇప్పుడు తాను ఒక బిడ్డ లాంటివాడ్నని.. ఆమె తనకు ఒక బిడ్డ లాంటిదని నరేష్ వివరించారు. ఇద్దరూ కలసి తమ పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా ఉంటామన్నారు.