‘నారా బ్రాహ్మణి..’ నందమూరి ఇంటి ఆడపడుచుగా, నారా వారి కోడలుగా ఆమె అందరికీ సుపరిచితమే.

విదేశాల్లో పైచదువులు చదివిన బ్రాహ్మిణి.. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు. అలా అని ఆమె ఇంటికే పరిమితమవ్వట్లేదు.

ఒక భార్యగా.. ఒక తల్లిగా.. ఒక ఎండీగా అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూనే.. తన కోరికలను సాధించుకుంటోంది.

ఇంతకీ.. బ్రాహ్మణి ఏం చేసిందంటారా! సహస యాత్ర. అటు సినిమా, ఇటు రాజకీయ కుటుంబమైనా.. ఇంట్లోనే గడపకుండా సాహసయాత్రలు చేస్తోంది.

హిమాలయాల్లో బైక్ రైడింగ్ చేయడమంటే అందరకీ ఇష్టమే. 

కాకుంటే ఎక్కువుగా యువకులే ఈ విషయంలో ప్యాషనేట్‌గా ఉంటారు. అలా అని మహిళలు ఉండరనేం కాదు. ఉంటారు.

కాకపోతే పురుషులతో పోలిస్తే చాలా తక్కువ. అలాంటి ప్యాషనేట్ బైక్ రైడర్స్‌లో నారా బ్రాహ్మణి ఒకరు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు.

ఎందుకంటే.. ఆమెకు అది అభిరుచే కానీ.. పబ్లిసిటీ కోసం కాదు.

కానీ ఓ బైక్ కంపెనీ ఆమె టీం సాహస బైక్ రైడింగ్ విశేషాలను వీడియో రూపంలో పంచుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

హిమాలయాలను సైతం అధిరోహించగలిగే సామర్థ్యం ఉన్న బైక్‌లను తయారు చేసే జావా యుజ్ది కంపెనీ ప్యాషనేట్ రేసర్లను ఓ జట్టుగా ఏర్పాటు చేసి.. తమ బైక్‌ల మీద ఇలా ట్రిప్‌లకు ప్లాన్ చేస్తూ ఉంటుంది.

ఇలాంటి ఓ ట్రిప్‌లో నారా బ్రహ్మణి పాల్గొన్నారు. బైక్‌కు ఏమైనా సమస్య వచ్చినా.. ప్రమాదం జరిగినా సాయం చేయడానికి కంపెనీ టీం ఉంటుంది

కానీ.. మొత్తంగా శారీరక శ్రమతోనే బైక్ రేసింగ్ చేయాలి. ఇాలాంటి రేసింగ్‌ను నారా బ్రాహ్మణి పూర్తి చేశారు.

కశ్మీర్‌లోని లద్దాఖ్ నుంచి లెహ్ వరకూ ఈ సాహస యాత్ర సాగింది. నారా బ్రహ్మణి బైక్‌ను అలవోకగా నడిపిన విధానం.. అందరిని ఆకట్టుకుంది.

ప్రయాణ అనుభవాలను కూడా బ్రాహ్మణి అందరితో పంచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది.