సాధారణంగా కథ డిమాండ్ చేస్తే.. హీరోలు, హీరోయిన్ లు ఏం చేయడానికైన సిద్దపడుతుంటారు.
ఇక హీరోలు అయితే తమ శరీరాకృతిని మార్చుకుని, సిక్స్ ప్యాక్స్, ఎయిట్ ప్యాక్స్ అంటూ సినిమాకు తగ్గట్లుగా రెడీ అవుతారు.
మరికొంత మంది హీరోలు అయితే డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్ సీన్స్ లో నటిస్తుంటారు.
ఇవన్ని ఒకెత్తు అయితే.. సినిమా కోసం హీరో మందు కొట్టడం మీరు ఎప్పుడైనా చూశారా? బహుశా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ హీరో ఇలా చేసి ఉండడు.
కానీ నేచురల్ స్టార్ నానీ దసరా మూవీ కోసం కొన్ని సీన్స్ లో ఏకంగా మందు కొట్టి నటించాను అని చెప్పి ఆశ్చర్యానికి గురిచేశాడు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన 'దసరా' మూవీ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
దసరాలోని కొన్ని సీన్స్ లో మందు కొట్టి నటించాలి అని డైరెక్టర్ చెప్పాడు.
నీకేమైనా అభ్యంతరం ఉందా? అని అడిగాడు శ్రీకాంత్.
నాకేం అభ్యంతరం లేదు అని కావాల్సిన సీన్స్ లో మందు తాగి నటించాను అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు నాని.
ఈ సీన్స్ లో కళ్లు ఎర్రగా కావడం, మందు కొట్టే మ్యానరిజమ్స్ ఉండటంతో కథ డిమాండ్ మేరకు నటించినట్లుగా చెప్పుకొచ్చాడు నాని.
ఇక దసరా మూవీలో నన్ను కావాల్సినంత గట్టిగా డైరెక్టర్ వాడుకున్నాడు అంటూ నవ్వులు చిందించాడు నాని.