ఈ భూమి మీద చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి. ఔషధాలు చెట్ల నుంచి కూడా దొరుకుతాయి.
అలాంటి చెట్లలో నల్ల తుమ్మ చెట్టు ఒకటి. ఇది బోలెడన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
నల్ల బెరడు ఉండి, పసుపు రంగు పూలు, పొడవాటి కాయలు, చిన్న చిన్న ఆకులు కలిగి ఉంటుంది.
దీని కలపను బొమ్మలు, పడవలు, ఫర్నిచర్ తయారీలో వాడతారు.
అయితే ఈ నల్ల తుమ్మ చెట్టు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
దీని బెరడు, జిగురు, తుమ్మ కాయలను కలిపి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకుంటే వెన్ను నొప్పి సమస్య తగ్గుతుంది.
లేత తుమ్మ ఆకులను జ్యూస్ లా చేసుకుని తాగడం వల్ల స్త్రీలలో నెలసరి అప్పుడు వచ్చే నొప్పులు తగ్గుతాయి.
నల్ల తుమ్మ చెట్టు ఆకులను ఎండబెట్టి.. పొడి చేయాలి.
ఆ పొడిని నీళ్లలో కలిపి తగినంత చక్కెర వేసుకుని తాగితే మగాళ్లలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
నల్ల తుమ్మ చెట్టు చిగురుని నోట్లో కొద్ది సేపు ఉంచుకుని బయటకు ఉమ్మి వేయాలి.
ఇలా చేయడం వల్ల నోటి పూత సహా ఇతర నోటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
నల్ల తుమ్మ చెట్టు జిగురుని ఎండబెట్టి పొడిగా చేసి.. పాలలో కలుపుకుని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
గమనిక: ఇది కేవలం అంతర్జాలం నుండి సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.