తెలుగు చిత్ర పరిశ్రమలో నట వారసులుగా  ఎంతో మంది హీరోలు తెరగ్రేటరం చేశారు

  అందులో కొంత మంది మాత్రమే అభిమానుల         గుండెల్లో స్థానం సంపాదించుకుంటారు.

అలా అక్కినేని నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైయ్యారు నాగార్జున. తనదైన నటనతో  ప్రేక్షకులు మనసుల్లో మన్మథునిగా నిలిచాడు.

     ప్రస్తుతం నాగార్జునకు సంబంధించి ఓ వింటేజ్      పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఆ ఫొటో  గురించిన విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 నాగార్జున సిని ప్రయాణం గురించి మనందరికి      తెలిసిందే. అలాగే అతడి వ్యక్తిగత జీవితం        గురించి కూడా దాదాపు అందరికి తెలుసు.

   నాగార్జున మెుదటి పెళ్లి స్టార్ ప్రొడ్యూసర్ మూవీ        మెుఘల్ అయిన దగ్గుబాటి రామానాయుడు                         కూతురు లక్ష్మితో జరిగింది.

వారి కుమారుడే హీరో నాగచైతన్య. తరువాత వారిద్దరి  మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు.

తర్వాత నాగార్జున అలనాటి హీరోయిన్ అమలను    పెళ్లి చేసుకున్నారు. వారికి పుట్టిన సంతానమే         హీరో అఖిల్. అటు దగ్గుబాటి కుటుంబం..

 ఇటు అక్కినేని కుటుంబాల మధ్య సత్సంబంధాలే           కొనసాగుతున్నాయి. తాజాగా నాగార్జున-లక్ష్మిల               అలనాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో 

    చక్కర్లు కొడుతోంది. నాగ్ ఈ ఫొటోలో గుర్తుపట్టలేని  విధంగా ఉన్నాడు. తమ అభిమాన హీరో అప్పట్లో ఇలా    ఉన్నాడా? అంటు కొందరు నెటిజన్స్ అంటుండగా..

 పాత ఫొటో చూసే అదృష్టం కలిగిందని మరికొందరు                                  అనుకుంటున్నారు.

ఇటీవలే నాగ్ కొడుకు నాగచైతన్యతో కలిసి బంగార్రాజు  చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.  ప్రస్తుతం నాగార్జున వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు

ఇటీవలే నాగ్ కొడుకు నాగచైతన్యతో కలిసి బంగార్రాజు  చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.  ప్రస్తుతం నాగార్జున వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు