ఆస్కార్ బరిలో RRR సినిమా ఉంది. 'నాటు నాటు' పాటకు అవార్డు వస్తుందా లేదా అని అందరూ టెన్షన్ పడుతున్నారు.
మరోవైపు ఈ సినిమాని ఆస్కార్ బరిలో ఉంచేందుకు రూ.80 కోట్లు ఖర్చు చేశారంటూ తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అందరూ మెచ్చుకుంటున్న ఓ సినిమాని తమ్మారెడ్డి అలా అనేసరికి సినీ పెద్దలే తట్టుకోలేకపోతున్నారు.
ఫస్ట్ ఫస్ట్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి మరీ తమ్మారెడ్డిని ఓ రేంజులో విమర్శించిన నాగబాబు ఇప్పుడు ఏకంగా వీడియో రిలీజ్ చేశారు.
RRR సినిమా గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఆస్కార్ అందుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే ప్రమోషన్స్ చేశారు.
అయితే తెలుగు సినిమా ప్రపంచస్థాయి వరకు వెళ్లడం చూసి అందరూ మెచ్చుకుంటుంటే, తమ్మారెడ్డి రూ.80 కోట్లు, 8 సినిమాలు అని విమర్శలు చేశారు.
ఇక్కడే ఒక్కొక్కళ్లకు బాగా మండిపోయింది. కె.రాఘవేంద్రరావు దగ్గర నుంచి నాగబాబు వరకు రెచ్చిపోయి మరి కౌంటర్స్ వేశారు.
ఇప్పుడు నాగబాబు తన కోపాన్ని అస్సలు దాచుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియో రిలీజ్ చేసి మరీ విమర్శించారు.
ఈ వీడియోలో భాగంగా చాలా స్మూత్ గా మాట్లాడిన నాగబాబు.. కౌంటర్స్ మాత్రం ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా వేశారు.
RRR మూవీ ఆస్కార్ బరిలో నిలవడం టాలీవుడ్ గర్వపడే విషయమని చెప్పిన నాగబాబు సినిమాని తెగ మెచ్చుకున్నారు.
ఈ విషయంలో సంగీత దర్శకుడు కీరవాణి, కొరియోగ్రాఫర్ తోపాటు హీరోలు రామ్ చరణ్,ఎన్టీఆర్ ని ప్రశంసించారు.
అదే టైంలో తమ్మారెడ్డి కామెంట్స్ పై స్పందించిన నాగబాబు.. రిటైరైపోయిన ఈ వయసులో ఈ కామెంట్స్ ఎందుకని మండిపడ్డారు.
మీ వల్ల కుక్కకి కూడా ఉపయోగం లేదని తమ్మారెడ్డిపై నాగబాబు ఇన్ డైరెక్ట్ గా చాలా పెద్ద కౌంటర్ వేశారు.
రాజకీయంగా ఇంతకు ముందు ఎన్ని మాట్లాడినా ఊరుకున్నాం కానీ తెలుగు సినిమా గురించి అంటే సహించేది లేదని నాగబాబు రెచ్చిపోయారు.
మీరు ఎలా బతకాలో ఆలోచించండి. సినిమా ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడాలో ఆలోచించండి అని తమ్మారెడ్డికి నాగబాబు చురకలంటించారు.
నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడితే ఎవరూ ఊరుకోరు. తమ్మారెడ్డి కంట్రోల్ యువర్ టంగ్ అని మాస్ వార్నింగ్ ఇచ్చారు నాగబాబు.
మరి నాగబాబు వార్నింగ్ వీడియోపై మీరేం అంటారు. తమ్మారెడ్డి కామెంట్స్ పై మీ రియాక్షన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.