నాగచైతన్య- సమంత విడాకులు. ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించిన నాగచైతన్య

నాగచైతన్య, సమంత కలిసుంటారా? విడపోతారా? వాళ్లు నిజంగానే విడాకులు తీసుకున్నారా? గత నెలరోజులుగా సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా ఇదే చర్చ.

ఈ ప్రశ్నలకు సమాధానాల కోసమే అభిమానులు, సినీవర్గాల వెతుకులాట.

వారి విడాకుల అంశంపై మీడియాలో చర్చలు తప్ప.. వారిద్దరూ నోరు మెదిపింది లేదు.

విడిగా ఉంటున్నారన్నది అర్థమవుతున్నా.. అధికారికంగా ఏమీ తెలియక తికమక పడ్డారు అందరూ. తిరుమలలో సమంతను ఓ జర్నలిస్టు అదే ప్రశ్న అడిగితే బుద్ధి ఉందా అంటూ చివాట్లు కూడా పెట్టింది.

ఇప్పుడు విషయం తేటతెల్లమైంది. వారి వివాహ బంధంపై స్వయంగా నాగచైతన్యానే స్పందించాడు.

ట్విట్టర్ వేదికగా నాగచైతన్య ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఎంతగానో ఆలోచించిన తర్వాత నేను, సమంత.. భార్యా, భర్తలుగా విడిపోబోతున్నాం.

మా జీవితాల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. దాదాపు దశాబ్ద కాలంగా మేం మిత్రులుగా కలిసున్నాం.

ఈ కాలం మొత్తం మా మధ్య ఒక అద్భుతమైన బంధాన్ని ఏర్పరిచింది. అభిమానులు, మీడియా వారికి ప్రత్యేకంగా విన్నపం.

ఇలాంటి క్లిష్టతర సందర్భాల్లో మాకు మీ సపోర్ట్ కావాలి. మే ముందుకు సాగేందుకు మాకు స్పేస్ ఇవ్వండి.

మీ మద్దతుకు ధన్యవాదాలు అంటూ నాగచైతన్య ఎంతో భావోద్వేగంగా వారి విడాకుల అంశంపై వివరణ ఇచ్చాడు.