తెలుగు వాళ్లు మాత్రమే భారతీయులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తోన్న ఆ తరుణం రానే వచ్చింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్‌ వేదిక మీద సత్తా చాటింది.

తెలుగు వారి నాటు కొట్టుడుకు.. ఆస్కార్‌ అవార్డు దాసోహం అన్నది.

ఆస్కార్‌ అవార్డ్స్‌-2023లో బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ కేటగిరిలో నామినేట్‌ అయిన నాటు నాటు.. ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది.

ఈ గీత రచయిత చంద్రబోస్‌, సంగీత దర్శకుడు కీరవాణి ఇద్దరు కలిసి వెళ్లి ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో నాటు నాటు పాట తెరకెక్కించారు.

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు తమ మాస్‌ స్టెప్పులతో నాటు నాటు పాటకు దుమ్ము రేపారు.

నాటు నాటు పాట చంద్రబోస్‌ కలం నుంచి జాలువారింది. అచ్చమైన పల్లె పదాలకు ఆస్కార్‌ సైతం దాసోహం అన్నది.

ఇక ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవలు తమ గాత్రంతో ప్రాణం పోశారు.

ఇక కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ ఈ పాట కోసం పడిన శ్రమ అంతా ఇంతా కాదు.

ఇందరి శ్రమ ఫలించి.. దేశం గర్వించే స్థాయిలో.. తెలుగు పాట ఆస్కార్‌ అవార్డు అందుకుంది.

ఆస్కార్‌ అవార్డు అందుకున్న తొలి భారతీయ పాటగా నాటు నాటు రికార్డ్‌ సృష్టించింది.

ఇక నాటు నాటుకు అవార్డ్‌తో దర్శక ధీరుడు, జక్కన్న ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది.

నాటు నాటు పాటకు పోటీగా అప్లాజ్, హోల్డ్ మై హ్యాండ్, లిఫ్ట్ మి అప్, థిస్ ఈజ్ ఏ లైఫ్ వంటి పాటలు ఉన్నాయి.

ఇప్పటికే నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాటను ఆలపించారు.

ఆస్కార్స్ 2023 మహోత్సవం మార్చి 12న లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది.

ఇండియన్‌ లమానం ప్రకారం ఇవాళ అంటే మార్చి 13న ఉదయం 5.30 గంటలకు అవార్డుల కార్యక్రమ ప్రసారం ప్రారంభమైంది.