పెరుగుతున్న వయసుని కంట్రోల్ చేయలేం కానీ హెల్తీగా ఉండేలా చూసుకోవాలి.

ఎందుకంటే 30 లోపు యవ్వనం ఉంటుంది కాబట్టి ఏ పనైనా సరే ఈజీగా చేసేస్తాం.

కానీ 30 దాటిన తర్వాత మధ్య వయసులోకి ఎంటరవుతాం. బాడీ బలహీనమవుతుంది.

ఇలాంటప్పుడే మనం ఫిట్ గా ఉండేలా చూసుకోవాలి. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి.

అంటే వ్యాయామం చేయడంతోపాటు శరీరాన్ని ఫిట్ గా ఉంచే ఫుడ్ తప్పనిసరిగా తీసుకోవాలి.

30 ఏళ్ల తర్వాత ఏం తింటారనే దానిపై ఆ తర్వాత 10-15 ఏళ్ల లైఫ్ ఆధారపడి ఉంటుంది.

అందుకే 30ల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓ నాలుగు ఫుడ్స్ మాత్రం కచ్చితంగా తీసుకోవాలి.

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు తినాలి.

దీని వల్ల గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ లాంటి ప్రమాదాలు నివారించొచ్చు.

ఒమేగా-3ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అంటే సాల్మన్ చేపలు, వాల్ నట్స్, చియా సీడ్స్ లాంటివి తినాలి.

ఫలితంగా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ముసలితనం కాస్త లేటుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.

30ల్లో ఎంటర్ అయిన తర్వాత ఎముకలు కాస్త బలహీనపడతాయి. కాబట్టి కాల్షియం పక్కాగా తీసుకోవాలి.

పెరుగు, బ్రోకలి, బచ్చలికూర, చీజ్, తృణ ధాన్యాల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆకుకూరల్లోనూ ఇది మెండు.

30ల్లో ఎంటర్ అయిన తర్వాత ఎముకలు కాస్త బలహీనపడతాయి. కాబట్టి కాల్షియం పక్కాగా తీసుకోవాలి.

దీనికోసం గుడ్లు, చికెన్, పాల ఉత్పత్తులు, పప్పులు, చిక్కుళ్లు లాంటి ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి.