చాలామంది బరువు తగ్గాలని తెగ ప్రయత్నిస్తుంటారు. దానికోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేయాలనుకుంటారు.

కానీ ఉదయం టిఫిన్ మానేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాత్రి భోజనం తర్వాత మనం ఏం తినం. కాబట్టి ఉదయం కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. లేకపోతే ఎనర్జీ ఉండదు.

బరువు తగ్గాలంటే అల్పాహారం మానేయడం ఆప్షన్ కాదు.

నిద్రలేచిన కొద్దిసేపటికే పవర్ తో కూడిన, ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ లు తీసుకునే అలవాటు.. మీ ఆకలి బాధలు ఆరికడుతుంది.

పోహా ఉప్మా వల్ల మీరు సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో మీ రోజు ప్రారంభించడం వల్ల ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

అలానే దీర్ఘకాలంలో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ మానేయొద్దు.

అల్పాహారం రోజూ తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ఛాన్సులు తగ్గుతాయని అధ్యయనాలు నిరూపించాయి.

ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ రక్తంలోని ఇన్సులిన్ స్పైక్ లని తగ్గిస్తుంది.

ఒకవేళ ఉదయం టిఫిన్ చేయడం మానేస్తే మాత్రం శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పడిపోయే ప్రమాదముంది.

క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే.. మీ మెదడు చక్కగా పనిచేస్తుంది. లేదంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.

మీరు అల్పాహారం దాటవేస్తే ఆకలి వేస్తుంది. దీంతో జంక్ ఫుడ్ కి ఆకర్షితులవుతారు.

కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం అల్పాహారం అస్సలు మిస్సవొద్దు. అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవద్దు.