చలికాలంలో అరటిపండు తినడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం పెరుగుతుంది.

చలికాలంలో అరటిపండు తినడం వల్ల కొల్లాజెన్ స్థాయిలు పెరుగుతాయి.

దీని వల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.

అరటి గుజ్జులో తేనె, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తర్వాత జుట్టు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

చలికాలంలో ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే చర్మంపై ముడతలు తగ్గుతాయి. 

అరటితో పాటు బొప్పాయి గుజ్జు, నారింజ గుజ్జు, తురిమిన ఆపిల్ ను కలిపి ఫేస్ ప్యాక్ లా చేసుకోవచ్చు.

అరటిపండులా ఉండే మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి చర్మ కణాలను రిపేర్ చేయడానికి సహకరిస్తాయి.

అరటిపండు తినడం ఇష్టం లేని వారు ఈ అరటి గుజ్జుని చర్మానికి అప్లై చేసుకోవచ్చు.

ఇలా చేస్తే ముఖంపై, చర్మంపై మచ్చలు తొలగిపోతాయి.

చర్మం డ్రైగా ఉండడం, తేమ లేకపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి.

బాగా పండిన అరటిపండుని గుజ్జుగా చేసి.. అందులో 2 టీ స్పూన్ల పెరుగు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఆరే వరకూ ఉంచండి.

20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో లేదా చల్లని నీటితో ముఖాన్ని, మెడని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మీద తేమ నిల్వ ఉండి పొడి బారకుండా ఉంటుంది.