సాధారణంగా గ్రామాల్లో మునగ చెట్టు ఉండని గడప ఉండదని అంటుంటారు. 

అంటే మునగ చెట్టు వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో అని దాని అర్ధం

మునగ కాయలు ఎన్నో రకాలుగా వంటలు వండుకొని తింటారు.. అలాగే మునగ ఆకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

 మునగ ఆకు తింటే ఎముకలకు బలం చేకూరడమే కాదు.. రక్తపోటు నియంత్రణ, జీర్ణశక్తి మెరుగు పర్చడంలో సహకరిస్తుంది.

మునగలో బీటాకెరోటిన్ సమృద్దిగా ఉంటుంది.. ఇది కళ్లకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. 

మునగలో పుష్కలంగా క్యాల్షియం ఉంటుంది.. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

మునగలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.. ఇది జీర్ణ వ్యవస్థను సక్రమం చేస్తుంది.. చెడు కొలెస్ట్రాల్ ని బయటకు పంపుతుంది.

తరుచూ మునగాకు తినడం వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.  జలుబు, దగ్గు నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

డైట్ లో మునగను తీసుకుంటే ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పెంచుతుంది.  

మునగ ఆకులో  ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇది  కిడ్నీ సమస్యలకు చెక్ పెడుతుంది.

మునగ ఆకు నేయ్యిలో వేయించి తింటే..  రక్తహీనత నుంచి ఉపశమనం పొందవొచ్చు.

తరుచూ మునగ ఆకు తినడం వల్ల కడుపులో మంట, తలనొప్పి, విరేచనాలు, కంటిచూపునకు గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. 

మునగ ఆకుతో సూప్ చేసుకొని తాగితే.. ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి మంచి ఉపశమనం పొందవొచ్చు.

మునగ ఆకు తింటే.. క్యాన్సర్లు,  అల్సర్లూ కనుచూపుమేర కనిపించవని అంటుంటారు వైద్య నిపుణులు.