ప్రస్తుత జనరేషన్ డైరెక్టర్స్ చాలామంది.. మన చుట్టూ జరిగే కథల్నే సినిమాలుగా తీస్తున్నారు.

'కలర్ ఫోటో' తో మనల్ని ఎంటర్ టైన్ చేసి, జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్.

అతడు స్టోరీ రాసిన సినిమానే 'ముఖచిత్రం'. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ: రాజ్ కుమార్(వికాస్ వశిష్ట) ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్. తొలిచూపులోనే మహతి(ప్రియ వడ్లమాని)ని ఇష్టపడతాడు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.

రాజ్ చిన్నప్పటి ఫ్రెండ్ మాయ(ఆయేషా ఖాన్) అతడిని ఇష్టపడుతూ ఉంటుంది. అయితే ఈమెని కాదని రాజ్, మహతిని పెళ్లి చేసుకుంటాడు.

కొన్నాళ్లకు మహతి, మాయలకు ఒకరోజు వేర్వేరుగా యాక్సిడెంట్స్ జరుగుతాయి. మహతి చనిపోతుంది. మాయ మాత్రం సీరియస్ కండీషన్ లో ఉంటుంది.

దీంతో చనిపోయిన మహతి ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసి మాయకు అమర్చుతాడు రాజ్. ప్రపంచం మొత్తాన్ని మాయనే మహతి అని నమ్మిస్తాడు.

రాజ్ ఈ పని ఎందుకు చేశాడు? చివరకు ఏం జరిగింది? ఈ స్టోరీలో లాయర్ విశ్వామిత్ర(విశ్వక్ సేన్) పాత్ర ఏంటనేది తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లో ఓ వివాహిత భర్తని చంపి, అతడి ముఖాన్ని ప్రియుడికి అమర్చింది. అప్పట్లో ఈ ఇన్సిడెంట్ చాలా హాట్ టాపిక్ గా మారింది. దాన్ని బేస్ చేసుకునే 'ముఖచిత్రం' తీశారనిపించింది

ఫేస్ మార్ఫింగ్ అనే ఎలిమెంట్ తో పాటు సెక్సువల్ రిలేషన్స్ లోని అపోహలు, భర్తల కారణంగా భార్యలు పడే ఇబ్బందులు లాంటి అంశాల్ని ఇందులో చాలా చక్కగా చూపించారు.

'ముఖచిత్రం' ఫస్టాప్ సాఫీగా ఉండగా, సెకండాఫ్ మాత్రం థ్రిల్లింగ్ గా అనిపించింది. అయితే భిన్నమైన అంశాల్ని డిస్కస్ చేయడంతో ప్రేక్షకులు ఓ టైంలో కన్ఫ్యూజ్ కూడా అవుతారు.

మహతి క్యారెక్టర్ చేసిన ప్రియ వడ్లమాని.. తన కెరీర్ బెస్ట్ ఇచ్చింది. ఇంతకు ముందు గ్లామర్ రోల్స్ చేసిన ఈమె.. ఈ సినిమాతో తన యాక్టింగ్ పవర్ చూపించింది.

మిగిలిన పాత్రలో వికాస్, విశ్వక్ సేన్, చైతన్య రావు, ఆయేషా ఖాన్ తదితరులు ఆకట్టుకున్నారు. సందీప్ రాజ్ ఎంచుకున్న స్టోరీ బాగుంది. తీసుకెళ్లిన తీరే కాస్త తికమక పెట్టింది.

డైరెక్టర్ గంగాధర్ కూడా మెప్పించాడు. కాలభైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు సెట్ అయింది.

ఓవరాల్ గా ఓ డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకుంటే.. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న 'ముఖచిత్రం' ట్రై చేయొచ్చు.

ప్లస్సులు: ప్రియ వడ్లమాని యాక్టింగ్, సందీప్ రాసుకున్న కథ, స్టోరీలోని థ్రిల్లింగ్ అంశాలు

మైనస్సులు: తేలిపోయిన క్లైమాక్స్, స్క్రీన్ ప్లేలో కాస్త కన్ఫ్యూజన్

చివరిమాట: కాస్త కన్ఫ్యూజ్ చేసినా సరే ఆకట్టుకునే చిత్రం.. ఈ 'ముఖచిత్రం'

రేటింగ్: 2.5/5