మీకు ధోనీ అంటే ఇష్టమా? అతడి కోసమే ఐపీఎల్ చూస్తున్నారా? ఈ స్టోరీ మీకోసమే!
ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మాదిరిగా ఆడుతోంది. ధోనీ కెప్టెన్సీ బాగానే చేస్తున్నాడు.
అయితే ధోనీ క్రీజులోకి వచ్చిన ప్రతి మ్యాచ్ లోనూ ఫ్యాన్స్ అరిచి గోల గోల చేస్తున్నారు.
పలు మ్యాచుల్లో సిక్సులు కొట్టి ధోనీ ఎంటర్ టైన్ చేశాడు. తన మార్క్ ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు.
అయితే ప్రస్తుత సీజన్ ప్రారంభానికి ముందే ధోనీ మోకాలికి గాయమైంది. కానీ అది పెద్దది కాదని తెలుస్తోంది.
ఇప్పటివరకు ధోనీ ఐదు మ్యాచులు ఆడేశాడు. దీంతో అతడికి గాయమైందనే విషయం అందరూ మర్చిపోయారు.
ఇలాంటి టైంలో బాంబ్ పేల్చే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. దీంతో ధోనీ ఫ్యాన్స్ తెగ కంగారు పడుతున్నారు.
ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది. చెపాక్ లో ఇది జరగనుంది.
ఇందుకోసం ఇరుజట్లు ప్రాక్టీసులో ఫుల్ బిజీగా ఉన్నాయి. అయితే ధోనీ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
అదే టైంలో సీఎస్కే ఓపెనర్ డేవాన్ కాన్వే వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో ధోనీ ఫ్యాన్స్ కి ఎక్కడలేని డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ధోనీ ఉండడా అని అనుకుంటున్నారు.
ఇప్పటివరకు ఐదు మ్యాచుల్లో మూడింట గెలిచిన చెన్నై.. పాయింట్ల పట్టికలో టాప్-3లో ఉంది.
ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తూ, మ్యాచులు గెలిస్తూ వెళ్తే చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్స్ లో అడుగుపెట్టడం పెద్ద కష్టమేం కాదు.
మరి ధోనీకి గాయం కావడం, ప్రాక్టీసులో కనిపించకపోవడం లాంటివి చూసిన తర్వాత మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.