ఇన్నాళ్లు సామాన్యుడికి భారంగా మారిన వంట నూనెల ధరలు దిగొచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా ధరలు తగ్గాయి.
ఈ మేరకు వంట నూనెల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో కూడా వంట నూనెల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
వంట నూనెల పరిశ్రమ సంఘానికి ఆహార మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిన క్రమంలో కంపెనీలు ధరలు తగ్గించాయి.
ప్రముఖ ఆయిల్ కంపెనీ మదర్ డెయిరీ వంట నూనె ధరలను తగ్గించింది.
లీటరు వంట నూనె ఎంఆర్పీ ధర మీద రూ. 15 నుంచి రూ. 20 తగ్గిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
లీటరు రిఫైండ్ సోయాబీన్ నూనె ఎంఆర్పీ ధర రూ. 170 మీద రూ. 20 తగ్గించింది. దీంతో లీటర్ రిఫైండ్ సోయాబీన్ నూనె ధర రూ. 150 అయ్యింది.
రైస్ బ్రాన్ ఆయిల్ రూ. 190 ఉంటే రూ. 20 తగ్గింపుతో రూ. 170గా ధరను నిర్ణయించింది.
రిఫైండ్ సన్ ఫ్లవర్ నూనె ఎంఆర్ఫీ ధర రూ. 170 మీద రూ. 15 తగ్గించింది.
దీంతో లీటర్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ రూ. 165 అయ్యింది.
వేరుశనగ నూనె కూడా రూ. 255 నుంచి రూ. 245కి తగ్గింది.
దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది.
ఈ సవరించిన ఎంఆర్పీ ధరలతో కూడిన ఆయిల్ ప్యాకెట్లను వచ్చే వారం నుంచి అందుబాటులో ఉంచుతామని కంపెనీ పేర్కొంది.
ఈ కంపెనీ బాటలోనే మిగతా ఆయిల్ కంపెనీలు కూడా ధరలను తగ్గించే యోచనలో ఉన్నాయి.