అట్లాంటిక్‌ బ్లూఫిన్‌ టూనా : ఈ జాతికి చెందిన చేప మాంసం చాలా ఖరీదు. 

గతంలో టోక్యోలో.. 600 పౌండ్ల ఈ చేప మాంసం దాదాపు 14 కోట్ల ధర పలకటం విశేషం.

అల్మాస్‌ కేవియర్‌ : దీన్ని గుడ్లతో తయారు చేస్తారు. ఇరాన్‌లో ఈ వంటకం పుట్టింది. 

ఓ కిలోగ్రామ్‌ అల్మాస్‌ కేవియర్‌ ధర అక్షరాలా 20 లక్షల రూపాయలు.

ఇడిబుల్‌ గోల్డ్‌ లీఫ్‌ : ఇవి తినగలిగే బంగారంతో తయారు చేసిన ఆకులు. వీటి ధర​ 12 లక్షల రూపాయలు.

ఇటాలియన్‌ వైట్‌ ట్రఫెల్‌ : దీన్ని అండర్‌గ్రౌండ్‌లో పెరిగే ఫంగీతో తయారు చేస్తారు. ఒక పౌండ్‌ ఇటాలియన్‌ ట్రఫెల్‌ ధర 4 లక్షల రూపాయలు. 

అయమ్‌ కెమాని బ్లాక్‌ చికెన్‌ :  ఇది ఇండోనేషియాకు చెందిన కోడి జాతి రకం. కండతో సహా అంతా నల్లగా ఉంటుంది. ఈ కోడి జత 3.7 లక్షల రూపాయలు.  

కోపీ లువాక్‌ కాఫీ : కోపీ లువాక్‌ కాఫీ ఏషియన్‌ పామ్‌ గింజల నుంచి తయారు చేస్తారు. ఒక పౌండ్‌ ఈ కాఫీ ధర 49 వేల రూపాయలు.

స్వాలో నెస్ట్‌ సూప్‌ : ఇది చైనాలో ఇది చాలా పాపులర్‌. సౌత్‌ ఈస్ట్‌ ఏషియాలో దొరికే స్విఫ్ట్‌లెట్‌ పక్షి మాంసంతో దీన్ని తయారు చేస్తారు. దీని ధర కేజీ 40 వేల రూపాయలు.

మూసే చీజ్‌ : స్వీడన్‌లోని మూసే హౌస్‌లోని ఫామ్‌నుంచి ఇది తయారు అవుతుంది. పౌండ్‌ మూసే చీజ్‌ ధర 37 వేల రూపాయలు.

పోయి గ్రాస్‌ : ఇది చాలా ఖరీదైన పదార్ధం. దీన్ని బాతు లివర్‌ నుంచి తయారు చేస్తారు. ఒక పౌండ్‌ ధర 7 వేల రూపాయలు.