లక్షలకు లక్షలు పెట్టి కార్లు కొనడమే కాదు.. వాటి నంబర్​ ప్లేట్​లకు ఎంతైనా పెట్టడానికి కొందరు సిద్ధమవుతున్నారు. 

ప్రస్తుతం వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్స్ కోసం భారీ మొత్తం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

అయితే నంబర్ ప్లేట్ కోసం వేలు లేదా లక్షల రూపాయలు ఖర్చు చేయడం గురించి వినుంటారు. 

కానీ ఒక కారు నంబర్ ప్లేట్ కోసం ఏకంగా వందల కోట్లు ఖర్చు పెట్టాడో వ్యక్తి. 

నంబర్ ప్లేట్ కోసం కోట్లు వెచ్చించడం ఏంటని ఆశ్చర్యపోకండి. ఇది నిజమే.

 యూఏఈ గవర్నమెంట్ రంజాన్ ఇఫ్తార్ విందు కోసం వేలంపాట నిర్వహించింది.

 ఈ ఆక్షన్​లో వెహికిల్స్ కోసం పలు వీఐపీ నంబర్ ప్లేట్లను అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. 

యూఏసీ వేలంలో పీ7 అనే నంబర్ కోసం ఒక వ్యక్తి ఏకంగా రూ.122 కోట్లు ఖర్చు చేశాడు. 

 ఒక నంబర్ ప్లేట్ కోసం గతంలో ఇంత మొత్తాన్ని ఎవరూ ఖర్చు చేయలేదు.

 2008లో అబుదాబిలో నిర్వహించిన వేలంపాటలో కారు నంబర్ ప్లేట్ కోసం ఏకంగా రూ.116.3 కోట్లు ఖర్చు చేశాడు.

ఇప్పుడు అంతకంటే దాదాపుగా రూ.6 కోట్లు అధికంగా ధర పలకడం విశేషం. దీంతో పాత గిన్నిస్ బుక్ రికార్డ్స్ బ్రేక్ అయ్యింది.

ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బులు ఛారిటీకి వెళ్తాయని యూఏఈ ప్రభుత్వ అధికారులు చెప్పారు. 

కారు నంబర్ ప్లేట్ కోసం వందల కోట్లు ఖర్చు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.