ఎక్కడచూసినా సరే చాలామంది జ్వరంతో తెగ ఇబ్బందిపడుతున్నారు. చాలామంది దగ్గుతూ కనిపిస్తున్నారు.

అయితే ఇన్ఫ్లూయెంజా కేసుల వల్లనే ఇలానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఒక్కొక్కరు ఒక్కో మెడిసన్ తీసుకుంటున్నారు.

అయితే మనలో చాలామందికి మందులు తీసుకోవడం ఇష్టముండకపోవచ్చు. అలానే జ్వరం త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటూ ఉంటారు.

ఇప్పుడు వాళ్ల కోసమేనా అన్నట్లు ఓ సింపుల్ చిట్కాతో వచ్చేశాం. ఇలా చేస్తే ఎలాంటి జ్వరమైనా అరగంటలో తగ్గిపోతుంది.

జనరల్ గా మన శరీరంలో ఒంటికి సరిపడా వేడి ఉంటుంది. అది తగ్గినా, పెరిగినా ప్రమాదమే. వేడి పెరిగితేనే జ్వరం మొదలవుతుంది.

ఒకవేళ ఒంట్లో హీట్ 100 డిగ్రీలు దాటితే నిల్చోవడానికి శక్తి కూడా ఉండదు. ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా సరే కొన్నిసార్లు జ్వరం తగ్గదు.

అయితే ఇప్పుడనే కాదు ఎప్పుడైనా జ్వరం వస్తే మనిషి నీరసమైపోతాడు. అలాంటి టైంలో జ్వరాన్ని తగ్గించడం ఎలానో ఇప్పుడు చూద్దాం.

200 గ్రాముల పెసరపప్పు తీసుకుని ఓసారి బాగా కడగండి. దాన్ని ఓ గిన్నెలో పోసి, గిన్నె నిండేలా నీరు పోయండి.

జ్వరం తీవ్రతను బట్టి, ఎక్కువగా ఉంటే 20 నిమిషాలపాటూ పెసరపప్పుని నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత పెసరపప్పును వడగట్టండి.

వడకట్టిన ఆ నీటిని గ్లాసులో పోసి, ఎవరైతే జ్వరంతో బాధపడుతున్నారో వాళ్లకు తాగించండి. ఇష్టపడకపోయినా ఎలాగోలా తాగించండి.

ఇలా ఈ నీరు తాగిన 10 నిమిషాల్లో పేషెంట్ శరీరంలో వేడి తగ్గుతూ వస్తుంది. 20 నుంచి 30 నిమిషాల్లో వేడి తగ్గుతుంది.

దీనితో పాటు నోటిలో చేదు, చప్పదనం కూడా కాస్త తగ్గుతుంది. అప్పుడు పేషెంట్‌కు ఏమైనా తినాలనే ఫీలింగ్ కలుగుతుంది.

అప్పుడు ఏ ఇడ్లీయో లేదా తేలిగ్గా జీర్ణమయ్యే ఫుడ్ ఫేషెంట్ కు తినిపించాలి. అదే టైంలో డాక్టర్ చెప్పిన టాబ్లెట్లు వేసుకోవాలి. దీంతో జ్వరం తగ్గిపోతుంది.

ఇదెలా సాధ్యమవుతుందంటే.. పెసరపప్పునకు మన శరీరాన్ని చల్లబరిచే లక్షణం ఉంది. అందులో విటమిన్ బి, సి, మాంగనీస్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.

వీటి వల్ల మన బాడీ కూల్ అవుతుంది. అందుకే చాలా ఇళ్లలో పెసర లడ్డూలు చేసి తింటారు. అవి మన శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తాయి.

వారానికి ఓసారైనా పెసరపప్పుతో వంటలు చేసి తినడం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సో అదన్నమాట విషయం.

ప్రస్తుతం మీలో చాలామంది జ్వరంతో ఇబ్బందిపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం పైన చెప్పిన చిట్కా ట్రై చేసి చూడండి.

నోట్: పైన చెప్పిన చిట్కా పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.