కొంతమందికి వైవాహిక జీవితం అనేది మూన్నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది.

మీకు తరుచుగా ఈ సంకేతాలు ఎదురవుతుంటే మీరు ఓ రాంగ్ పర్సన్ ని పెళ్ళి చేసుకున్నట్టు లెక్క!  

మీరు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఏరోజూ సంతోషంగా ఉండరు.

ఇద్దరి మధ్య గొడవలు, విబేధాలు తలెత్తడం అనేది డైలీ సీరియల్ అవుతుంది.

ఇద్దరి అభిప్రాయాలూ పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. 

జీవిత భాగస్వామిలో నిజాయితీ అనేది గాడి తప్పుతుంది. 

మీ భాగస్వామి మీ దగ్గర సీక్రెట్స్ దాస్తున్నారని అనిపిస్తుంది. 

 మీ నుండి భాగస్వామి ప్రైవసీ కోరుకుంటారు.

మీ పట్ల అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తారు. మీ మీద ఫ్రస్ట్రేట్ అవుతుంటారు.

ఆర్థిక విషయాల్లో ఇద్దరి దారులు వేరుగా ఉండటం. 

 మీ పుట్టింటి వాళ్ళకి మీ పార్టనర్ అస్సలు గౌరవం ఇవ్వకపోవడం

 మీ కోసం అతను/ఆమె తమ సరదాలను వదులుకోవడానికి ఇష్టపడకపోవడం

మీ కష్టాన్ని మీ భాగ్యస్వామి చాలా లైట్ తీసుకుంటూ ఉండటం. 

అన్నిటికీ మించి.. మీ పార్ట్నర్ మరొకరితో శారీరిక సంబంధం పెట్టుకోవడం.

ఇలాంటి అనుభవాలు మీ సంసార జీవితంలో మీకు ఎదురవుతూ ఉంటే.. మీరు ఓ రాంగ్ పర్సన్ ను పెళ్లి చేస్కున్నట్టే లెక్క