ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన కృష్ణ మరణించారు.

అభిమానులని శోకసంద్రంలో ముంచేస్తూ దివికెగిశారు.

తన సినిమాల్ని మాత్రం ఎప్పటికీ చెరిగిపోని తీపిగుర్తులుగా మిగిల్చారు.

ఆయన మృతి పట్ల స్టార్ సెలబ్రిటీలు నుంచి సామాన్యుల వరకు నివాళి అర్పించారు.

అయితే సూపర్ స్టార్ కృష్ణ-మెగాస్టార్ చిరంజీవి మధ్య ప్రత్యేక బాండింగ్ ఉంది.

అందుకు సంబంధించిన ఓ నోట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.

తెలుగు చిత్రసీమలో సాధారణ నటుడిగా కెరీర్ ప్రారంభించిన కృష్ణ.. అనితర సాధ్యమైన రికార్డులు సృష్టించారు.

హీరోగా, దర్శకుడిగా, నిర్మతగా, రైటర్ గా చాలా అంటే చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు స్టార్స్ గా ఉన్న ఎందరో హీరోలకు స్పూర్తిగా నిలిచారు.

ఇక సూపర్ స్టార్ కృష్ణకు మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అనే విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.

అప్పట్లో కృష్ణకు 2500కు పైగా అభిమాన సంఘాలు ఉండేవి. మనకు తెలిసినంత వరకు ఓ హీరోకి ఈ రేంజ్ లో ఫ్యాన్స్ ఉండటం విశేషం.

అప్పట్లో పద్మాలయా కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో చిరు ఓ అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి చాలా ఏళ్ల పాటు ప్రెసిడెంట్ గానూ చేశారు.

'తోడు దొంగలు' రిలీజ్ సందర్భంగా ఈ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో ఓ పాంప్లెట్ రిలీజ్ చేశారు. అదే ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇకపోతే ఇదే సినిమాలో సూపర్ స్టార్ కృష్ణతో చిరంజీవి కూడా కలిసి నటించడం విశేషం.