ఇంకా డాక్టర్ చదువు పూర్తి కాలేదు, కానీ ఒక అద్భుతం చేసి డాక్టరమ్మ అయిపోయింది ఓ యువతి. రైలులో ప్రయాణిస్తుండగా ఒక మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది.
దీంతో మెడిసన్ చదివిన ఓ యువతి డాక్టర్ అవతారం ఎత్తింది. దగ్గరుండి మరీ మహిళకి పురుడు పోసింది. ఈ ఘటన అనకాపల్లి సమీపంలో చోటు చేసుకుంది.
వైజాగ్ లోని గీతం యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న స్వాతి రెడ్డి అనే మెడికల్ విద్యార్థిని.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రయాణం చేస్తుంది.
రైలు అనకాపల్లి స్టేషన్ ని సమీపిస్తున్న సమయంలో.. ఆ గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతోంది.
కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఆ సమయంలో స్వాతి రెడ్డి ఆమెకు సహాయం చేసింది. తోటి మహిళల సాయంతో ఆ మహిళకు పురుడు పోసింది.
ఆ తర్వాత మహిళను, బిడ్డను 108 అంబులెన్స్ లో స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వైద్యపరీక్షలు నిర్వహించగా.. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.
బిడ్డకు వైద్య సహాయం అందేవరకూ స్వాతి రెడ్డి వారితోనే ఉన్నారు. ఈ మెడికల్ స్టూడెంట్ పుణ్యమా అని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా..
ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. స్వాతి రెడ్డి చేసిన సాయానికి మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ యువతి చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో కూడా ఇలానే ఓ మహిళ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతుంటే.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ నేరుగా బస్సుని హాస్పిటల్ కి పోనిచ్చి
ప్రసవం అయ్యేలా చేసి మహిళ, బిడ్డ ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన జూన్ నెలలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు డ్రైవర్, కండక్టర్ లను ప్రశంసించారు.
ఇలా ఆపదలు వచ్చినప్పుడు కొంతమంది సూపర్ మ్యాన్ లా, సూపర్ ఉమెన్ లా ప్రాణాలను కాపాడుతున్నారు.
మరి స్వాతి రెడ్డి అనే మెడికల్ స్టూడెంట్.. ఒక మహిళకి పురుడు పోయడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇంకా డాక్టర్ చదువు పూర్తి కాలేదు, కానీ ఒక అద్భుతం చేసి డాక్టరమ్మ అయిపోయింది ఓ యువతి. రైలులో ప్రయాణిస్తుండగా ఒక మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది.