ఏ ఫీల్డ్‌ లో ఉన్న వాళ్లు.. అదే ఫీల్డ్‌ లో ఉన్న వాళ్లను వివాహం చేసుకోవడం కొత్తేం కాదు. అలాగే రాజకీయాల్లోనూ ఓ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.

అందులో వింతేమీ లేదు. కానీ, వారి పెళ్లి పిలుపు మాత్రం దేశవ్యాప్తంగా పొగడ్తలు, ప్రశంసలు అందుకుంటోంది.

ఆ వైరల్‌ పెళ్లి పోస్టు ఎవరిదంటే.. ఆర్య రాజేంద్రన్‌(మేయర్‌)- సచిన్‌ దేవ్‌(ఎమ్మెల్యే)లది.

ఆర్య రాజేంద్రన్.. ఈమె కేరళలోని తిరువనంతపురం మేయర్.

విద్యార్థినిగా ఉన్న సమయంలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది.

దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మేయర్ గా రికార్డుల కెక్కింది.

ఆమె సచిన్ దేవ్ అనే ఓ ఎమ్మెల్యేని వివాహం చేసుకోబోతోంది. సచిన్ దేవ్ కూడా అక్కడ బాగా ఫేమస్ అనే చెప్పాలి.

ఎందుకంటే సచిన్‌ ప్రముఖ నటుడు ధర్మజన్ బోల్గట్టిపై పోటీ చేసి నెగ్గాడు.

వీళ్లు చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు, కలిసి ఎస్ఎఫ్ఐలో పని చేశారు. అక్కడే వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సామాన్యులుగా ఉన్న వీళ్లు అనుకున్నది సాధించి సెలబ్రిటీలుగా ఎదిగారు.

ఇప్పుడు వీరి వివాహంతో మరింత ఆదరణ సొంతం చేసుకోబోతున్నారు.

వీరు పెళ్లిచేసుకోబోతున్నట్లు ఫేస్ బుక్ లో పెట్టిన ఒక పోస్టు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. 

అదేంటంటే.. మేము సెప్టెంబర్ నెల 4వ తేదన ఉదయం 11 గంటలకు తిరువనంతపురంలోని ఏకేజీ హాల్ లో పెళ్లి చేసుకోబోతున్నాం.. అని అందరినీ ఆహ్వానించారు.

అయితే వివాహానికి వచ్చే వాళ్లు మాత్రం ఎలాంటి బహుమతులు తీసుకురావొద్దని షరతు పెట్టారు.

అంతేకాకుండా ఎంతో సింపుల్‌గా ఓ మ్యారేజ్ హాలులో వివాహం చేసుకోబోతున్నారు.