జనవరి ఆటో ఎక్స్పో మారుతీ సుజుకీ ఈ ఫ్రాంక్స్ కారుని పరిచయం చేసింది. బలేనో, బ్రెజా, ఎస్-క్రాస్ ఫీచర్లు, లుక్స్ ని మిక్స్ చేసి క్రాస్ ఓవర్ పేరిట తీసుకొచ్చారు.
దీనిని రెండు ఇంజిన్ వేరియంట్స్ తో అందిస్తున్నారు. ఒకటి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండు 1 లీటర్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్.
ఇందులో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని వినియోగించారు.
పెడల్ షిఫ్టర్స్ తో 6 స్పీడ్ ఆటోమేటెడ్ గేర్ షిఫ్టింగ్ టెక్నాలజీ ఉంది. మాన్యువల్ అయితే 5 గేర్లతో రానుంది.
హెడప్ డిస్ ప్లే, వైర్ లెస్ ఛార్జింగ్, 9 ఇంచెస్ డిస్ ప్లేతో స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ సరౌండ్ సౌండ్, డ్యూయల్ టోన్ ప్లష్ ఇంటీరియర్, 360 డిగ్రీల కెమెరా వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
6 స్ట్రైట్ కలర్స్, 3 డ్యూయల్ టోన్ కలర్స్ తో అందుబాటులోకి రానుంది. అలాగే డెల్టా, డెల్టా ప్లస్, సిగ్మా వంటి వేరియంట్లలో రాబోతోంది.
అతి తక్కువ బడ్జెట్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ తో ఈ కారుని తయారు చేశారు.
అంతేకాకుండా పెడస్ట్రియన్ ప్రొటెక్షన్ కంప్లైన్స్(ప్రమాదం సమయంలో పాదచారుడుకి దెబ్బలు తగలకుడా కాపాడే టెక్నాలజీ), ఏబీఎస్ టెక్నాలజీ ఉన్నాయి.
ఎల్ఈడీ లైట్స్, స్లీక్ డిజైన్, నెక్సావేవ్ గ్రిల్ డిజైన్, 300 లీటర్స్ కి పైగా బూట్ స్పేస్ ఉంది. బేసిక్ మోడల్ లో కూడా షార్క్ ఫిన్ అందిస్తున్నారు.
ఈ కారులో మారుతీ సుజుకీ స్మార్ట్ వాచ్ కనెక్టివిటీని కూడా అందిస్తున్నారు.
మీ స్మార్ట్ వాచ్ తో ఈ కారుని స్టార్ట్ చేయచ్చు, స్టాప్ చేయచ్చు, కారు ఏసీ కంట్రోల్ చేయచ్చు, డోర్స్ లాక్ చేయడం కూడా చేయచ్చు, కారుని కూడా మీరు మీ స్మార్ట్ వాచ్ తో లాక్ చేయచ్చు.
ఏప్రిల్ నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.
దీని ధర వేరియంట్ ని బట్టి రూ.8 లక్షల నుంచి రూ.14 లక్షల మధ్య ఉంటుందని టాక్ వినిపిస్తోంది.