మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందికి అసలు ఆకలే వేయదని నిపుణులు తెలియ జేస్తున్నారు.

కొంతమంది అయితే ఉదయం టిఫిన్ చేస్తే సాయంత్రం అయినా కూడా ఆకలి వేసినట్టు కూడా అనిపియదట. ఇలాంటి సమస్య చాలా మందికి ఉంటుంది.

ఆకలి వేయకపోవడానికి ఏమైన కారణాలు ఉన్నాయా? నిపుణులు ఎలాంటి  సూచనలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మనిషి శరీరానికి ఆహారం ఇందనం లాంటిదని, సమయానికి తినకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు దరి చేరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గర్భం దాల్చడం, ఒత్తిడి, నిరాశ, అందోళన వంటి కారణాల వల్ల కూడా తొందరగా ఆకలి వేసినట్లుగా అనిపియదట.

ఆకలి లేదు కదా అని సమయానికి ఏదో ఒకటి తినకపోతే అనారోగ్య పాలు కావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనిషి దీర్ఘకాలిక తల నొప్పితో బాధ పడుతుండడం వల్ల కూడా ఆకలి వేయదట. దీని కారణంగా ఉదయం తింటే సాయంత్రం అయినా కూడా ఏం తినాలనిపించదు.

మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మంది బీపీ, షుగర్ వంటి వాటి నివారణకు అనేక రకాల మందులు వాడుతుంటారు. 

ఇలా మందులు వాడడం ద్వారా కూడా తొందరగా ఆకలి వేయదని తెలుస్తుంది.

వయసుతో పాటే మనిషి ఆహారపు కోరికలు  కూడా తగ్గుతాయట. దీంతో వయసు పెరిగిన చాలా మందికి ఈ కారణం చేత కూడా ఆకలి వేయదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మనిషి అనారోగ్యంగా ఉన్నప్పుడు రోగ నిరోదక వ్యవస్థ అనారోగ్యం నుంచి బయటపడేందుకు పని చేస్తుందని, ఈ ఆ సమయంలో మనిషికి ఆకలి వేయదట. 

అందుకే జ్వరం వచ్చినప్పుడైనా, అస్వస్థతకు గురైనప్పుడైనా మనకు ఎక్కువగా ఆకలి అనిపించదు.

మనిషి ఆకలి తగ్గడానికి మానసిక ఒత్తిడి కూడా ప్రధాన కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ కారణం చేత మనిషికి ఆకలి వేయదట.

మనిషి డిప్రెషన్ లో ఉన్నప్పుడు అవాంఛిత ఒత్తిడి హార్మోన్లు ఆకలి వేయకుడా పని చేస్తాయని ఆరోగ్య నిపుణలు తెలియజేస్తున్నారు.

పైన తెలిపిన కారణాల వల్ల మనిషికి సమయానికి ఆకలి వేసినట్లుగా అనిపియదట. 

అయితే ఇలా సమయానికి తినకుండా అలాగే ఉంటే చివరికి ఏరికోరి అనారోగ్యాలను కొనితెచ్చుకొవడమే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.