పూదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

సాధారణంగా వేసవి కాలంలో ఎండల తీవ్రత  తట్టుకోవడానికి శరీరానికి చలువ చేసే  పదార్ధాలు, ఆకు కూరలను ఎక్కువగా  తీసుకుంటారు.

ఎండాకాలంలో  పూదీనా ఆకుతో  చాలా  ప్రయోజనాలు ఉన్నాయని అని ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు.

పుదీనా ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు,  మెంథాల్, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా  ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ.

పుదీనా ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు,  మెంథాల్, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా  ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ.

పుదీనా   ఆహారం జీర్ణం కావడానికి  సహాయపడుతుంది. పుదీనా కండరాలకు  విశ్రాంతినిస్తుంది.

ప్రతిరోజూ పూదీనా రసం  నుదుటిపై రాసుకుంటే  తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనసు  ప్రశాంతత చేకూర్చుతుంది.

పుదీనా  కండరాల నొప్పిని తగ్గించడంలో  ఎంతో సహాయపడతాయి.

పూదినాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ  బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. 

కడుపు నొప్పితో బాధపడేవారు..  పూదీనా ఆకులు మరిగించి తాగితే ఎంతో  ఉపశమనం కలుగుతుంది.

పుదీనా చర్మంపై మొటిమలను తొలగించడంలో  చక్కగా పని చేస్తుంది. 

ఎసిడిటీ ఉన్నవాళ్లు  రోజుకో గ్లాసు పుదీనా  రసం తీసుకుంటే సత్వరం ఫలితం లభిస్తుంది.

పుదీనా క్రమం తప్పకుండా వాడితే..  చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా  మారుస్తుంది.

ప్రతిరోజూ పుదీనా ఆకులను నమలడం  వల్ల దంతాల ఆరోగ్యం మెరుగు పడుతుంది.