మనం తినే ఆకు కూరల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.

పొన్నగంటి కూర, ఇది మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర.

పొన్నగంటి కూర అమరాంథేసి కుటుంబానికి చెందిన  ఆకుకూర. 

ఇది ఎక్కువ నీటి చెరువులు, కాల్వలు.. నీటి ఒడ్డున పెరుగుతుంది

పొన్నగంటికి విత్తనాలు వుండవు.  కాండం ద్వారా అభివృద్ధి చెందగలదు. ఇవి ఏడాది పొడవునా కూడా లభిస్తాయి. 

పొన్నగంటి కూరను రక రకాలుగా వండుకోవచ్చు.

తరుచూ పొన్నగంటి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పొన్నగంటి తినడం వల్ల అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి

గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు మాత్రం  వైద్యుల సలహాతోనే ఈ ఆకుకూరను తినాలి.

పొన్నగంటి జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఔషధ చికిత్సగా ఉపయోగిస్తారు.

ఇందులో జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్‌ దీనిలో సమృద్ధిగా ఉంటుంది.

పొన్నగంటిలో విటమిన్ 'ఎ', 'బి6', 'సి', ఫొలేట్, 'రైబోఫ్లెవిన్', పొటాషియం, ఐరన్, మెగ్నీషియం  సమృద్ధిగా ఉన్నాయి

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా ఇది ఎంతో సహాయపడుతుంది.

పొన్నగంటి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకుంటే  ఆస్తమా, బ్రాంకైటిస్ తో బాధపడేవారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది.

షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో, జీవ‌క్రియ‌లో ఉండే లోపాల‌ను స‌వ‌రించ‌డంలో కూడా పొన్న‌గంటి కూర స‌హాయ‌ప‌డుతుం

కళ్ల‌ క‌ల‌క‌ల‌ను త‌గ్గించ‌డంతోపాటు కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది.

త‌ర‌చూ  పొనగంటి తిన‌డం వ‌ల్ల చ‌ర్మ రోగాలు. ప్లీహ సంబంధ‌మైన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.