బత్తాయి.. దీన్నే మోసంబీ లేదా స్వీటీ లైమ్ అంటారు. వేసవిలో ప్రతి ఒక్కరూ బత్తాయి జ్యూస్ తాడగానికి ఇష్టపడతారు

బత్తాయి పండ్లు నేరుతా తినవొచ్చు.. జ్యూస్ చేసుకొని తాగవొచ్చు. ఇది శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది

బత్తాయి రసంలో విటమిన్ సి తో పాటు  పొటాషియం పుష్కలంటా ఉంటుంది.

బత్తాయి శరీరాన్ని చల్లబర్చడమే కాకుండా..  అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 

బత్తాయి జ్యూస్ లో పీచు పదార్థాలు, జింక్, కాపర్, ఐరన్ శక్తి, క్యాల్షియం ఎన్నో దాగి ఉన్నాయి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

రోజు ఓ గ్లాస్ బత్తాయి జ్యూస్ తాగితే.. వ్యాధినిరోధక శక్తి పెరగడమే కాదు..  శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది.

బత్తాయి జ్యూస్ లో తేనె, ఉసిరి కలిపి తాగితే డయాబెటీస్ పేషెంట్స్ కి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది.

గర్భిణీ స్త్రీలు తరచూ బత్తాయి రసాన్ని తాగితే.. ఇందులో ఉండే క్యాల్షియం, కడుపులో బిడ్డకు ప్రయోజనాలను చేకూర్చుతుంది.

బత్తాయి జ్యూస్ తాగడం వల్ల  రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 

మూత్రనాళంలో మంటతో బాధపడేవారు బత్తాయి జ్యూస్ లో గ్లూకోజ కానీ చక్కెర కానీ కలుపుకొని తాగితే మూత్రవ సాఫీగా వస్తుంది.

బత్తాయి జ్యూస్ లో  ఫ్లెవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్ధ పనితీరును మెరుగుపరుస్తాయి.

బత్తాయి జ్యూస్ రెగ్యూలర్ గా తాగడం వల్ల గుండె ఆరోగ్యంతోపాటు, రక్త ప్రసరణ చక్కగా ఉంటుంది.

పేగుల్లో పూతల వల్ల అల్సర్లు, గ్యాస్ సమస్యలు అనేకం ఉంటాయి.. వాటన్నింటిని బత్తాయి రసంతో చెక్ పెట్టవొచ్చు.

బత్తాయి జ్యూస్ తోకీళ్ల నొప్పులు, అధిక బరువు నుంచి ఉపశమనం లభిస్తుంది