మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై దేశమంత చర్చించుకుంటుంది

ఈ అల్లర్లలో 54 మంది మరణించగా.. పదుల సంఖ్యలో మంది గాయపడ్డారు.

అంతేకాక ఈ అల్లర్ల కారణంగా కోట్ల  రూపాయల ఆస్తి నష్టం జరిగింది.

అసలు మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు జరగడానికి కారణం ఏంటనే సందేహం కొందరిలో వ్యక్తమవుతుంది.

మణిపూర్‌లో ఇంతలా విధ్వంసం జరగటానికి కారణం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మణిపూర్‌ రాష్ట్రంలో మైతీ, నాగా, కుకీ అనే  మూడు ప్రధాన జాతులు ఉన్నాయి.

మణిపూర్ జనాభాలో ఎక్కువ శాతం మైతీలే ఉన్నారు. చట్ట సభలో కూడా వీరి సంఖ్య ఎక్కువే.

అలానే  ఆ తరువాతి నాగా, కుకీ జాతుల వారు ఉన్నారు. వీరిని ప్రభుత్వం ఎస్టీలుగా గుర్తించింది

కొండలపై నివాసం ఉండటంతో నాగా, కుకీ జాతుల వారిని ప్రభుత్వం ఎస్టీలుగా గుర్తించింది.

మైతీలు లోయ ప్రాంతాల్లో  ఉంటున్నారు. మైతీలు రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్నారు.

ఇప్పటివరకు 10 మంది మైతీకి చెందిన వారు సీఎంలుగా పని చేశారు.

కేవలం రెండు సార్లు మాత్రమే నాగా, కుకీ జాతికి చెందిన వారు పని చేశారు.

చాలా ఏళ్ల నుంచి మైతీలు.. తమకు ఎస్టీ హోదా కావాలని పోరాటం చేస్తున్నారు.

హైకోర్టులో మైతీలు వేసిన పిటిషన్ పై తాజాగా స్పందించింది.

మైతీల ఎస్టీ హోదా డిమాండ్‌ పై.. నాలుగు వారాల్లో జవాబు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

అయితే, కోర్టు ఆదేశాలను అప్పటికే ఎస్టీలుగా ఉంటున్న వారు తప్పుగా అర్థం చేసుకున్నారు.

 దీంతో గొడవ మొదలై.. మైతీలను ఎస్టీల్లో చేర్చొద్దంటూ  మిగిలిన జాతుల వారు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

 ఆల్‌ ట్రైబల్స్‌ సూడెంట్స్‌ మణిపూర్‌లో ఒక ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ సందర్భంగా అనుకోకుండా జరిగిన ఓ ఘటన కారణంగా గిరిజన తెగల వారికి, మిగిలిన తెగ వారికి గొడవ మొదలైంది.

ఆ గొడవ చినికి, చినికి గాలి వాన అయింది. ఇతర ప్రాంతాలకు కూడా రావకాష్ఠంలా  వ్యాపించింది.