బాలకృష్ట నిన్న జరిగిన ‘వీరసింహా రెడ్డి’ సినిమా సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ ‘మంగమ్మ గారి మనవడు’ సినిమా గురించి ప్రస్తావించారు.
‘మంగమ్మ గారి మనవడు’ ఈ సినిమాలో తాను కామెడీ చేశానని అన్నారు.
‘మంగమ్మ గారి మనవడు’ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు.
బాలయ్య బాబు ప్రత్యేకంగా చెప్పేంత విషయం ‘‘మంగమ్మ గారి మనవడు’’ సినిమాలో ఏముంది?
‘మంగమ్మ గారి మనవడు’ సినిమా 1984లో విడుదలై సూపర్ హిట్ అయింది.
‘మన్ వాసనై’కి రీమేక్‌గా ‘‘మంగమ్మ గారి మనవడు’’ తీయబడింది.
మంగమ్మగా భానుమతి.. వీరన్నగా నందమూరి బాలకృష్ణ.. మల్లిగా సుహాసిని అద్భుతంగా నటించారు.
‘‘ దంచవే మేనత్త కూతురా..’’.. ‘‘ శ్రీ సూర్య నారాయణ.. మేలుకో’’ పాటలు ఆల్‌టైమ్ హిట్ పాటలయ్యాయి.
హీరోగా బాలకృష్ణ కెరీర్‌లో 100 రోజులు ఆడిన మొదటి సినిమా ఇదే కావటం విశేషం.
హైదరాబాద్‌లో 565 రోజులు, పక్క రాష్ట్రం కర్నాటకలో 100 రోజులు ఆడింది.
తెలుగు సినిమా చరిత్రలో ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా రికార్డు నెలకొల్పింది.
పోకిరి సినిమా రిలీజయ్యే వరకు ఈ సినిమాపైనే రికార్డులు ఉన్నాయి.
ఈ సినిమా వచ్చి దాదాపు 40 సంవత్సరాలు అవుతున్నా క్రేజ్ మాత్రం తగ్గటం లేదు.