గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న పుకార్లకు చెక్‌ పడింది. మనోజ్‌ వెడ్స్‌ మౌనిక అంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది.

స్వయంగా మంచు మనోజ్‌.. తన పెళ్లి గురించి.. కాబోయే భార్య ఫోటో ట్వీట్‌ చేసి తెలిపాడు.

శుక్రవారం ఉదయం.. మనోజ్‌ సోదరి మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం జరిగినట్లు సమాచారం.

ఇరు కుటుంబాలు, అతి కొద్ది మంది బంధు మిత్రలు సమక్షంలో వీరి వివాహం జరిగింది.

పెళ్లికి ముందు సంగీత్‌, మెహందీ వంటి కార్యక్రమాలు జరిగాయి.

ఇందుకు సంబంధించిన ఫొటోలను మంచు లక్షి తన ఇన్‌ స్టా స్టోరీలో షేర్‌ చేసింది.

మౌనిక, మనోజ్‌ ఇద్దరికి ఇది రెండో వివాహమే.

మనోజ్‌కు 2015లో హైదరాబాద్‌కు చెందిన ప్రణతితో వివాహం అయ్యింది.

నాలుగేళ్ల తర్వాత అనగా 2019లో వీరిద్దరూ విడిపోయారు.

భూమా మౌనిక విషయానికి వస్తే.. ఆమె దివంగ‌త రాజకీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె.

మౌనికకు కూడా 2015లో వివాహం అయ్యింది. తర్వాత భర్త నుంచి విడిపోయింది.

ఇక గత కొద్ది రోజులుగా మౌనిక-మనోజ్‌ ఇద్దరు  లవ్‌లో ఉన్నారు.

వీరిద్దరూ తొలిసారి ఓ గణేష్‌ మండపం దగ్గరకు జంటగా వచ్చి.. అందరిని ఆశ్చర్యపరిచారు.

దాంతో వీరి రిలేషన్‌ గురించి జనాలకు ఓ క్లారిటీ వచ్చింది. ఇక నాటి నుంచి వీరిద్దరి పెళ్లి గురించి రూమర్లు ప్రచారం అవుతూ వచ్చాయి.

ఈ క్రమంలో మార్చి 3న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.