మంచు ఫ్యామిలీ గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా సరే అందరూ అలెర్ట్ అయిపోతారు. కొత్తగా ఏ విషయం మాట్లాడారు ఏంటి అని సెర్చ్ చేస్తారు.

ఎందుకంటే.. ఈ కుటుంబంలో ఎవరైనా సరే చాలా నార్మల్ గా మాట్లాడతారు కానీ అది సోషల్ మీడియాలో ట్రెండ్ అయి కూర్చుంటుంది. 

మొన్నటికి మొన్న బాగా పాపులర్ అయనా ‘జారు మిఠాయి’ సాంగ్ కూడా ‘జిన్నా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా బయటకొచ్చింది.

ఇదంతా పక్కనబెడితే.. మోహన్ బాబు కావొచ్చు, విష్ణు కావొచ్చు, మనోజ్ కావొచ్చు, మంచు లక్ష్మీ కావొచ్చు అందరూ మంచి నటులే కానీ.. వాళ్లకు సరైన పాత్రలు పడటం లేదు.

ఒక్కసారి గనుక వాళ్లు రెచ్చిపోవడం గ్యారంటీ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. మంచు లక్ష్మీ అలాంటి రోల్ ఒకటి తాజాగా చేసింది.

కానీ అది డైరెక్ట్ తెలుగు సినిమా కాకపోవడం వల్ల పెద్దగా ఎవరూ దాని గురించి మాట్లాడుకోవడం లేదు…

ఇక వివరాల్లోకి వెళ్తే.. మంచు లక్ష్మీ అనగానే మోహన్ బాబు కూతురు అని గుర్తుపట్టేస్తారు. కానీ తన తొలి సినిమా ‘అనగనగా ఓ ధీరుడు’తో తండ్రికి తగ్గ తనయ అని ప్రూవ్ చేసింది.

అదే సినిమాతో అవార్డు కూడా కొట్టేసింది. ఇక ఆ తర్వాత కూడా అడపాదడపా డిఫరెంట్ రోల్స్ చేస్తూ వచ్చిన మంచు లక్ష్మీ.. తాజాగా మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ‘మాన్‌స్టర్’ మూవీలో దుర్గ అనే పనిమనిషి క్యారెక్టర్ చేసింది.

ఇంకా చెప్పాలంటే ఆ పాత్రని మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటివరకు తెలుగులో హీరోయిన్, విలన్ తరహా రోల్స్ చేస్తూ వచ్చిన మంచు లక్ష్మీ.. ఇందులో మాత్రం చాలా కొత్తగా కనిపించింది.

మరీ ముఖ్యంగా ఆమె స్క్రీన్ స్పేస్ తక్కువే ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేసింది. 2011లో హరియాణాలో ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు.

అయితే ప్రజలు వాళ్లకు కొట్టి పంపించేస్తారు. ఆ తర్వాత వాళ్లు ఏం చేశారనే దాన్ని బేస్ చేసుకుని ‘మాన్‌స్టర్’ స్టోరీ రాసుకున్నారు.

అందుకు తగ్గట్లే ఈ సినిమాలో భామిని పాత్ర హనీ రోజ్ చేయగా, దుర్గ అనే క్యారెక్టర్ ని మంచు లక్ష్మీ పోషించారు. ఇక వీళ్లిద్దరూ ఇందులో హోమో సెక్సువల్స్ గా నటించారు.

ఈ జోడీ మధ్య లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇందులో మంచు లక్ష్మీ, హనీరోజ్ చాలా అద్భుతంగా నటించారు. ఇలాంటి రోల్స్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి.

దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న మంచు లక్ష్మీ.. నటిగా మరో మెట్టు ఎక్కేసింది. తనకు పాత్ర నచ్చాలే గానీ ఎలాంటిది అయినా సరే చేసేస్తానని చెప్పకనే చెప్పింది.

అలానే ఈ సినిమాలోనే హీరో మోహన్ లాల్ తో ఫైట్ చేసింది. విలనిజం కూడా చూపించింది. స్క్రీన్ స్పేస్ తక్కువైనప్పటికీ.. మంచు లక్ష్మీ క్యారెక్టర్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం గ్యారంటీ.