ఇదివరకు బాలీవుడ్ లో బయోపిక్స్ తెరకెక్కిన సినిమాలు చూసాం.. కానీ తెలుగులో కూడా ఇప్పుడు మేజర్ సినిమాతో సరికొత్త ట్రెండ్ మొదలుకానుందని చెప్పవచ్చు.
26/11 ముంబై ఉగ్రదాడులలో ప్రాణాలు కోల్పోయిన సోల్జర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
కథ:
మేజర్ సినిమా కథ.. ముందునుండి చెప్పినట్లుగానే కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని ప్రధాన అంశాలను బేస్ చేసుకొని రూపొందించారు.
అతని చిన్నతనం నుండి ఫ్యామిలీ ఎమోషన్స్, గోల్స్.. లవ్.. ఆర్మీ సైనికుడిగా ఎదిగిన తీరు. చివరికి ముంబై దాడుల్లో సందీప్ ప్రాణాలు వదిలిన విధానాన్ని చాలా మనసుకు హత్తుకునే కథగా చూపించారు.
కాలేజీ టైంలో క్లాస్ మెట్ ఇషా(సయీ మంజ్రేకర్)తో ప్రేమలో పడతాడు సందీప్. ఆ తర్వాత సందీప్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎలా ఎదిగాడు?చివరిగా ముంబై ఉగ్రదాడుల్లో ఎలా ప్రాణాలు విడిచాడు? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
26/11 ఉగ్రదాడులను భారతీయులు ఎప్పటికి మర్చిపోలేరు. ఆ దాడుల్లో ఎంతోమందిని తన బృందంతో కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ కథను తెరపైకి తీసుకురావడానికి ఎంతకష్టపడ్డారో.
ఓ రియల్ హీరో జీవితకథ ఆధారంగా తెలుగులో తెరకెక్కిన మొదటి సినిమాగా మేజర్ పేరు ఎప్పటికి నిలిచిపోతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయాడు అనేది జనాలు మాట్లాడుకోకూడదు..
అతను ఎలా బ్రతికాడు? అనేది గొప్పగా చెప్పుకోవాలంటూ తెరపై ఆవిష్కరించింది చిత్రబృందం.
మేజర్ సందీప్ పాత్రలో నటుడు అడివి శేష్ జీవించేసాడు. సినిమా చూస్తున్నంతసేపు మనకు శేష్ ఎక్కడా కనిపించడు.
సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ని, క్యారెక్టర్ బిహేవియర్ ని చాలా బాగా రాసుకున్నారు. అలాగే కథలో ట్విస్టులను, సందీప్ లైఫ్ లోని టర్నింగ్ పాయింట్ లను స్క్రీన్ ప్లేలో చక్కగా పొందుపరిచారు.
మేజర్ సినిమాతో కూడా శేష్ రైటింగ్ స్కిల్స్ టాప్ నోచ్ అని మరోసారి ప్రూవ్ చేశాడు. ముఖ్యంగా మేజర్ సందీప్ క్యారెక్టరైజేషన్ ని పక్కాగా డిజైన్ చేసుకున్నారు.
ఈ సినిమాలో ఎక్కడకూడా ఈ సీన్ అవసరం లేదుకదా అనిపించకుండా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అర్థమవుతుంది.
ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంత ఎంగేజింగ్ గా సాగడానికి శేష్ స్క్రీన్ ప్లే, ఎడిటర్స్ వినయ్ కుమార్, పవన్ కళ్యాణ్ ల రోల్ ప్రధాన కారణం
ముఖ్యంగా ముంబై దాడుల యాక్షన్ సీక్వెన్స్ అంతబాగా ఆకట్టుకున్నాయంటే క్రెడిట్ వంశీతో పాటు.. డైరెక్టర్ శశికి దక్కుతుంది.
అలాగే మేజర్ కి బ్యాక్ బోన్ అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. శ్రీచరణ్ పాకాల పాటలు బాగున్నాయి. డైలాగ్స్ గురించి.. రైటర్ అబ్బూరి రవి చాలాకాలం తర్వాత తన పెన్ పవర్ చూపించే ప్రయత్నం చేశాడు.
ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సందీప్ ఎమోషన్స్ ని తన మాటలతో చాలా బాగా ఎలివేట్ చేశారు. ఇక సినిమాలో చివరిగా యాక్టర్స్ గురించి చెప్పుకోవాలి.
మేజర్ సందీప్ పేరును పాన్ ఇండియా స్థాయిలో మోతమోగించి.. మనసులను గెలుచుకున్నారని చెప్పవచ్చు.