ఇండస్ట్రీలో సూపర్ హిట్ డైరెక్టర్ తో స్టార్ హీరో మూవీ చేస్తున్నాడు అంటే చాలు ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతుంటాయి.

అదీకాక ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చూడని కాంబినేషన్ సెట్ అయిందంటే ఆ మూవీ హాట్ టాపికే.

ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి అంచనాలు ఉన్న సినిమా ఏదైనా ఉంది అంటే.. అది సూపర్ స్టార్ మహేష్ బాబు-SS రాజమౌళిల కాంబినేషన్ అనే చెప్పాలి.

ఇక పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కే ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కు ఇన్స్పిరేషన్ ఓ దేవుడు అని తెలుస్తోంది.

ప్రతీ సినిమాకు ఇతిహాసాలను ఆదర్శంగా తీసుకుంటాడు జక్కన్న.

పాన్ వరల్డ్ అడ్వెంచరల్ సినిమాలో మహేష్ క్యారెక్టర్ కు లార్డ్ హనుమాన్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు రాజమౌళి.

రామాయాణంలోని హనుమంతుడి పాత్రను ఆదర్శంగా తీసుకుని సూపర్ స్టార్ క్యారెక్టర్ ను జక్కన్న డిజైన్ చేశాడట.

అదీకాక ఆఫ్రికన్ జంగిల్ లో దెయ్యాల లాంటి వ్యక్తులతో మహేష్ జరిపే పోరాటాలు ఒళ్లు గగుర్పోడిచే విధంగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చజరుగుతోంది.

హనుమంతుడు అంటే ఎంత పవర్ ఫుల్లో.. కాబట్టి తమ హీరో క్యారెక్టర్ కూడా అంతే పవర్ ప్యాక్ గా ఉంటుందని ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ చిత్రం పాన్ వరల్డ్ మూవీగా 2025వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.